Gold and SIlver Price Today 5 September 2022 in Hyderabad: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు పసిడి ధర పెరిగితే మరో రోజు తగ్గుతుంది.. ఇంకో రోజు మాత్రం స్థిరంగా ఉంటుంది. డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, పలు దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే బంగారం ధరలు ఎంత పెరిగినా లేదా తగ్గినా.. వ్యాపారాలు మాత్రం జోరుగానే సాగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా బంగారం ధర హెచ్చు, తగ్గులకు లోనవుతున్న విషయం తెలిసిందే. శనివారం (సెప్టెంబర్ 3) వారం పెరిగిన పసిడి ధర.. రెండు రోజులుగా స్థిరంగా ఉంది. సోమవారం (సెప్టెంబర్ 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,650లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,890లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన పట్టణాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 


# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,050గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,890గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,220గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,510 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,700గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,940గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,890గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,890గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,650.. 24 క్యారెట్ల ధర రూ. 50,890గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,890 వద్ద కొనసాగుతోంది. 


బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 52,500లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 52,500లుగా ఉండగా.. చెన్నైలో రూ. 58,200లుగా ఉంది. బెంగళూరులో రూ. 58,200గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 58,200లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 58,200ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారు ప్రేమ విషయంలో జాగ్రత్త!
Also Read: IND vs PAK: నిరాశపరిచిన భారత బౌలర్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook