Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు! తులం బంగారం ఎంతంటే
Today (2023 April 29) Gold Rate and Silver Price in Hyderabad. శనివారం (ఏప్రిల్ 29) దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 200 తగ్గి.. రూ. 55,750లుగా ఉంది.
Today Gold Rate and Silver Rate in Hyderabad: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు నేడు కాస్త తగ్గాయి. శనివారం (ఏప్రిల్ 29) దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 200 తగ్గి.. రూ. 55,750లుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 తగ్గి... రూ. 61,040గా కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధరపై స్థిరంగా ఉంది. కిలో వెండి ధర నేడు రూ. 76,200గా ఉంది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి.
పెళ్లిళ్లకు ముందే బంగారు, వెండి ధరలు కాస్త తగ్గడం శుభపరిమాణం అని చెపొచ్చు. మగువలు, బంగారం ప్రియులకు గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన అవకాశం. భారతదేశంలోని పలు ప్రధాన నగరాలు కూడా బంగారం ధరలలో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ .60,970గా ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,820గా ఉంది.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,970గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,820గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,310 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,800గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,870గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,820గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,820గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,750.. 24 క్యారెట్ల ధర రూ. 60,820గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,820 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర నేడు స్థిరంగా ఉన్నాయి. శనివారం (ఏప్రిల్ 29) దేశీయంగా కిలో వెండి ధర రూ. 76,200లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,200లుగా ఉండగా.. చెన్నైలో రూ. 80,000లుగా ఉంది. బెంగళూరులో రూ. 80,000గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 80,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Hyderabad Rains Today: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ఈదురు గాలులతో భారీ వాన! వడగండ్ల హెచ్చరికలు
Also Read: JEE Main 2023 Result Out: జేఈఈ మెయిన్ 2023 ఫలితాలు విడుదల.. ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.