JEE Main Session 2 Result 2023 Released: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2023 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) శనివారం ఉదయం (2023 ఏప్రిల్ 29) విడుదల చేసింది. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్లో విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచిందింది.
జేఈఈ మెయిన్ 2023 సెషన్-1 పరీక్షలు 2023 జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6 నుంచి 15వరకు సెషన్-2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి.. మొత్తంగా 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు.
విద్యార్థులు ఎన్‌టీ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ లో అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ చెక్ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్ 2023 సెషన్-2 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అధికారులు ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేశారు. ఏప్రిల్ 21వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తొలి విడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకుని.. 8.24 లక్షల మంది హాజరు అయ్యారు. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 9 లక్షల మంది వరకు పరీక్షకు హాజరయినట్టు సమాచారం.
ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు మే 8 వరకు చెల్లించవచ్చు. 2023 మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎక్జామ్ జూన్ 4న ఉంది. పేపర్ 1 ఉదయం 9 నుంచి 12 వరకు.. పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30వరకు ఉంటుంది. ఈ ఎక్జామ్ ప్రాథమిక సమాధానాల కీ జూన్ 11న రిలీజ్ కానుంది. ఇక ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి.
Also Read: Hyderabad Rains Today: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ఈదురు గాలులతో భారీ వాన! వడగండ్ల హెచ్చరికలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.