Gold Price Today: పసిడి మరోసారి షాక్ ఇచ్చింది. వరుసగా రెండవరోజు భారీగా ధర పెరిగింది. బంగారం ధర ఆకాశాన్ని తాకేలా ఉంటోంది. దేశీయంగా బంగారం తులం ధర మరో 110 రూపాయలు పెరిగింది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ఆభరణాలకు డిమాండ్ ఏర్పడింది. పెరుగుతున్న బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరల్లో(Gold Price)మరోసారి భారీ పెరుగుదల చోటుచేసుకుంది. వరుసగా రెండవ రోజు కూడా బంగారం ధర పెరగడం ఆందోళన కల్గిస్తోంది. నవంబర్ నెలతో పాటు డిసెంబర్ నెలలో భారీగా ముహూర్తాలు ఉండటంతో వినియోగదారులకు ఇబ్బంది ఎదురవుతోంది. పెరుగుతున్న ధరలతో ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా తులం బంగారం ధర 110 రూపాయలు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర ఇప్పటికే 50 వేల రూపాయలు దాటేసింది. హైదరాబాద్ మార్కెట్‌లో(Hyderabad Gold Price) 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 70 రూపాయలు కాగా, 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 9 వందలుగా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో(Visakhapatnam Gold Price) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50 వేల 70 రూపాయలు కాగా, 22 క్యారెట్లు బంగారం పది గ్రాముల ధర 45 వేల 9 వందలుంది. 


ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో(Delhi Gold Price) బంగారం ధర మరీ ఎక్కువగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52 వేల 420 రూపాయలు కాగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48 వేల 250గా ఉంది. ఢిల్లీతో పోల్చితే ముంబైలో కాస్త తక్కువగానే ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 470 అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 470గా ఉంది. అటు చెన్నైలో కూడా 24 క్యారెట్ల బంగారం తులం 50 వేల 450  కాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 250గా ఉంది. ఇక బెంగళూరులో(Bengaluru Gold Price) 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల 70 కాగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 900గా ఉంది. కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేల 450 అయితే..22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 750 పలుకుతోంది. 


మొత్తానికి చూసుకుంటే దేశంలో బెంగళూరు, తెలుగు రాష్ట్రాల్లోనే బంగారం ధర తక్కువగా ఉంది. ఢిల్లీ తరువాత ఎక్కువ ధర కోల్‌కత్తాలో ఉంది. ఇక వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. కిలో వెండి 4 వందల రూపాయల వరకూ తగ్గింది. 


Also read: యమహా నుంచి మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ధర ఎంతో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook