Gold Price Today In India On 28th January 2021:  జనవరిలో గత రెండు వారాలుగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గగా, ఢిల్లీలోనూ ధరలు పతనమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad On 28th January 2021)లలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.330 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,900 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం రూ.300 తగ్గింది. నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.45,750కి పతనమైంది.


Also Read: H1B Visa: హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగస్వాముల‌కు Joe Biden భారీ ఊరట



ఢిల్లీలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా క్షీణిస్తున్నాయి. అయితే గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు(Gold Price Today In India On 28th January 2021) తాజాగా రూ.210 మేర దిగొచ్చాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,250 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900కి పతనమైంది.


Also Read: SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI



దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా వెండి ధర సైతం పతనమైంది. తాజాగా బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ.300 మేర దిగొచ్చింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,200కి క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.600 మేర క్షీణించింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర పతనం కాగా, నేడు సైతం అదే ధర రూ.70,700కి పడిపోయింది.


Also Read: Jio Recharge Plans: మీకు అధికంగా డేటా కావాలా, Reliance Jio 5 బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook