Gold Price Today, 8 December 2020:  బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) యథాతథంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు సైతం భారీగా క్షీణించాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) నిన్నటి ధరలతో కొనసాగుతోంది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,900 అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో డిసెంబర్ ఆరంభంలో పెరిగిన బంగారం ధరలు (Gold Price in Delhi) క్రమంగా తగ్గుతున్నాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరపై రూ.230 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.52,420కి పతనమైంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,050కి పడిపోయింది.  


Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి   



గత నెలలో బులియన్ మార్కెట్‌లో భారీగా పతనమైన వెండి ధరలు డిసెంబర్ నెలలోనూ వరుసగా దిగొస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.900 మేర పతనమైంది. దీంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.63,000కి దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర 900 మేర తగ్గింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.


Also Read : Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook