Gold Price Today: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.  పది గ్రాముల బంగారం ధర 53 వేలకు చేరుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. అప్పట్నించి భారీగా పెరుగుతోంది. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయనేది తెలిసిందే. అదే సమయంలో రెండు దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం, వెండితో సహా అన్ని ఇతర అంశాలపై పెను ప్రభావం చూపిస్తుంటుంది. బంగారం అందుకే గత కొద్దిరోజులుగా పెరుగుతోంది. 


దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 590 రూపాయలుగా ఉంది. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 590 రూపాయలుంది. చెన్నైలో మాత్రం బంగారం ధర గతంతో పోలిస్తకే..కాస్త తగ్గింది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 120 తగ్గి 52 వేల 840కు చేరింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 590 రూపాయలుంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 590 రూపాయలుంది. అటు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 590 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో సైతం ఇదే ధర కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీలో కిలో వెండి ధర 68 వేల 900 గా ఉంది. ముంబయిలో కిలో వెండి 68 వేల 9 వందలుంది. అదే హైదరాబాద్‌లో కిలో వెండి ధర అత్యధికంగా 73 వేల 4 వందలుంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధర కొనసాగుతోంది. 


Also read: Medicines Price Hike: సామాన్యులపై మరో భారం... పారాసిటమాల్ సహా పెరగనున్న 800 రకాల మందుల ధరలు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook