Medicines Price Hike: సామాన్యులపై మరో భారం... పారాసిటమాల్ సహా పెరగనున్న 800 రకాల మందుల ధరలు...

Medicines Price Hike: ఇప్పటికే పెరిగిన గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై మరో భారం పడనుంది. ఈసారి మందుల ధరలు పెరగనున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 08:51 PM IST
  • పెరగనున్న మెడిసిన్ ధరలు
  • 10 శాతం మేర పెరగనున్న 800 రకాల మందులు
  • వెల్లడించిన నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ
Medicines Price Hike: సామాన్యులపై మరో భారం... పారాసిటమాల్ సహా పెరగనున్న 800 రకాల మందుల ధరలు...

Medicines Price Hike: ఇప్పటికే పెరిగిన గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై మరో భారం పడనుంది. ఈసారి మందుల ధరలు పెరగనున్నాయి. యాంటీ బయాటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్టివ్, పెయిన్ కిల్లర్స్‌తో సహా 800 రకాల మందుల ధరలు 10.7 శాతం మేర పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ శుక్రవారం (మార్చి 26) ఈ విషయాన్ని వెల్లడించింది.

హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్-2021లోని 800 రకాల మందుల ధరలను 10.7 శాతం మేర సవరిస్తున్నట్లు ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ తెలిపింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. ధరలు పెరగనున్న వాటిల్లో జ్వరానికి వాడే పారాసిటమాల్, యాంటీ బయాటిక్స్ సొప్రోఫ్లాక్సాసిన్, మెట్రోనిడాజోల్, చర్మ వ్యాధులకు, గుండె సంబంధిత సమస్యలకు, కరోనా చికిత్సకు, అనీమియా, బీపీ, తదితర వాటికి సంబంధించిన మందులు ఉన్నాయి. 

ఇండస్ట్రీ నిపుణుల ప్రకారం.. గత రెండేళ్లలో ఏపీఐ (Active Pharmaceutical Ingredient) ధరలు 15 శాతం నుంచి 130 శాతం పెరిగాయి. సిరప్స్, ఓరల్ డ్రాప్స్, స్టెరైల్ ప్రిపరేషన్స్‌లో ఉపయోగించే గ్లిజరిన్, ప్రొపైలిన్ గ్లైకోల్ వంటి ధరలు భారీగా పెరిగాయి. మందుల తయారీకి ఉపయోగించే ముడి రసాయనాల కోసం విదేశాలపై ఆధారపడటం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెబుతున్నారు.

కాగా, దేశంలో ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడుతోంది. తాజాగా మందుల ధరల పెంపుకు నిర్ణయం తీసుకోవడం సామాన్యులపై మరో భారం వేసినట్లయింది.

Also Read: Gold and Silver Price Today: మరోసారి షాకిచ్చిన పసిడి ధర.. హైదరాబాద్‌లో బంగారం, వెండి రేట్లు ఎంత పెరిగాయంటే!!

Also Read: Kishan reddy on TS Govt: 'ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై విమర్శలు తగవు'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News