Todays Gold Rate: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజురోజుకూ పతాక స్థాయిలో పెరుగుదల కన్పిస్తోంది. ఇప్పుడు ఒకేసారి భారీగా పెరిగి..విమన్స్ డే నాడు మహిళలకు షాకిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం క్రూడ్ ఆయిల్, బంగారం ధరలపై పెను ప్రభావమే చూపిస్తోంది. గత కొద్దిరోజులుగా నెలకొన్న పరిస్థితులు ధరలపై, ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా పసిడి ధర రోజురోజుకూ పరుగెడుతోంది. మహిళలకు మక్కువైన బంగారం..ప్రపంచ మహిళా దినోత్సవం నాడు ఒక్కరోజులోనే వేయి రూపాయలు పెరిగి షాకిచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 4 వందలు కాగా, 24 క్యారెట్ల ధర 53 వేల 890గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 4 వందలైతే.. 24 క్యారెట్ల ధర 53 వేల 890 రూపాయలుగా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 710 రూపాయలు కాగా, 24 క్యారెట్ల ధర 55 వేల 320 రూపాయలుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 4 వందలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 890 రూపాయలుంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 4 వందలైతే.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 890 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 4 వందలైతే..24 క్యారెట్ల ధర 53 వేల 890 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది. 


Also read: iPhone SE 3: యాపిల్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్​ఫోన్- రేపే మార్కెట్లోకి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook