iPhone SE 3: యాపిల్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్​ఫోన్- రేపే మార్కెట్లోకి!

iPhone SE 3: బడ్జెట్​ సెగ్మెంట్​లో యాపిల్​ నుంచి ఐఫోన్​ ఎస్​ఈ 3 (2022) మోడల్​ రేపు విడుదల కానుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్స్​ అంచనాలు సహా ఇతర విశేషాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 10:08 PM IST
  • రేపు యాపిల్​ ఈవెంట్
  • మార్కెట్లోకి విడుదల కానున్న కొత్త ప్రోడక్ట్స్​
  • ఐఫోన్ ఎస్​ఈ3పైనే అందరి చూపు
iPhone SE 3: యాపిల్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్​ఫోన్- రేపే మార్కెట్లోకి!

iPhone SE 3: యాపిల్​ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్​ఫోన్​ ఐఫోన్​ ఎస్​ఈ 2022 రేపు మార్కెట్లోకి విడుదల కానుంది. మార్చి 8 ఉదయం 10 గంటలకు (ఇండియాలో  రాత్రి 11.30 గంటలకు) ఈవెంట్​ను ఫిక్స్ చేసింది యాపిల్​. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది కూడా.

రేపు విడుదల కానున్న ప్రొడక్ట్స్​ ఇవే..

రేపు వివిధ యాపిల్ ఉత్పత్తులను విడుదల చేయనుంది కంపెనీ. ఇందులో అందరి దృష్టి బడ్జెట్ స్మార్ట్​ఫోన్ ఐఫోన్​ ఎస్​ఈ 3 (2022)పైనే ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్​ఈ2 (2020)కి కొనసాగింపుగా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

వివిధ వేరియంట్లలో ఐఫోన్​ ఎస్​ఈ 2022 అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. టెక్ వార్తా కథనాల ప్రకారం.. 64 జీబీ స్టోరేజ్​, 128 జీబీ స్టోరేజ్​, 156 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రావచ్చని సమాచారం. ర్యామ్ విషయానికొస్తే.. 3 జీబీ ర్యామ్​, 4 జీబీ ర్యామ్​ అప్షన్స్​లో అందుబాటులో ఉండొడ్డని సమాచారం.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 4.7 అంగుళాల డిస్​ప్లే, నాచ్​ డిస్​ప్లేతో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ప్రీమియం మోడళ్ల మాదిరిగా.. ఎస్​ఈ 2022లో కూడా వెనకవైపు రెండు కెమెరాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ముందువైపు సింగిల్​ లెన్స్​ కెమెరాతోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

రెడ్​, బ్లాక్​, వైట్​ వేరియంట్లలో ఐఫోన్​ ఎస్​ఈ 3 అందుబాటులోకి రావచ్చని సమాచారం.

ఇక ఈ మోడల్​ 5జీ వేరియంట్​తో అందుబాటలోకి రావచ్చని అంచనాలున్నాయి.

ఆండ్రాయిడ్ యూజర్లను ఆకర్షించే విధంగా బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్​ఫోన్​ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాపిల్​ సిద్ధమైనట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఐఫోన్​ఎస్​ఈ 2022 ధరను ఇండియాలో రూ.23 వేలతో అందుబాటులోకి తెచ్చే వీలుందని తెలుస్తోంది.

Also read: Rupee Value: జీవకాల కనిష్ఠానికి రూపాయి.. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి?

Also read; Stocks today: వెంటాడిన రష్యా-ఉక్రెయిన్​ భయాలు- రికార్డు స్థాయిలో పతనమైన మార్కెట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News