Todays Gold Rate: బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ మాత్రం స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారంపై 20 రూపాయల మేర తగ్గుదల నమోదైంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Rate)10 గ్రాముల ధర 46 వేల 650 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల 9 వందలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 590 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 590 రూపాయలుగా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 870 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 950 రూపాయలుంది. ఇక పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల 850 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 550 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 7 వందలైతే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 760 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 7 వందలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 760 రూపాయలుగా ఉంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Rate) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 7 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 760 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 7 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 760  రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది.


Also read: Vodafone Idea stake : ప్రభుత్వ ఆధీనంలోకి వొడాఫోన్‌ ఐడియా కంపెనీ, మేజర్‌ వాటా దక్కించుకున్న సర్కార్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి