బులియన్ మార్కెట్‌లో వరుసగా బంగారం ధరలు (Gold Rate Today) తగ్గుతున్నాయి. తాజాగా బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. బంగారం ధర రూ.50 వేల దిగువకు పడిపోయింది. పసిడికి భిన్నంగా వెండి ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Price in Delhi) దిగొచ్చాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.650 మేర దిగొచ్చాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బం గారం 10 గ్రాముల ధర రూ.51,990 అయింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.600 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,660కి క్షీణించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.650  మేర దిగొచ్చింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,760 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.45,610కి దిగొచ్చింది.


Also Read : Digital Life Certificate: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త సర్వీసు ప్రారంభం


 


బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా వెండి ధరలు (Silver Rate in India) పతనమవుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.50 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.60,050 అయింది. దేశ వ్యాప్తంగా కేజీ వెండి ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.


Also Read : YES Bank Credit Card సంచలనమైన ఫీచర్! వినియోగదారులకు శుభావార్త!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook