Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్.. త్వరపడండి!
వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్ పేమెంట్స్ చేసే వారికి రూ. 255 ఖచ్చింతంగా క్యాష్ బ్యాక్ లభించనుంది. మరేందుకు ఆలస్యం ఇక్కడ తెలిపిన విధంగా వాట్సాప్ పేమెంట్స్ మోడ్ యాక్టివ్ చేసుకొని 255 రూపాయల క్యాష్ బ్యాక్ పొందండి.
Whats App Rs.255 Cash Back Offers on Payments: మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూపీఐ లావాదేవాలను గతేడాది నవంబర్ నుండి ప్రవేశ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే! అయితే ఇది కొంత మందికే అందుబాటులో ఉండగా... ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ తన పేమెంట్ (Whats App Payments) వినియోగదారులని పెంచుకునే క్రమంలో ఇతర పేమెంట్స్ యాప్ లా తరహాలో క్యాష్ బ్యాక్ లను ప్రకటించింది.
పక్కాగా రూ. 255 క్యాష్ బ్యాక్..
అవునండి.. వాట్సాప్ పేమెంట్స్ మోడ్ వాడే వారికోసం ఖచ్చితమైన రూ. 255 క్యాష్ బ్యాక్ (Whats App Cash Back) ను అందిస్తుంది. అయితే మొత్తం 255 రూపాయలు ఒకేసారి కాకూండా 5 దఫాలా వారీగా... మొదటి 5 లావాదేవీలకు గానూ ఈ క్యాష్ బ్యాక్ పొందనున్నారు. మొదటగా వాట్సప్ పేమెంట్స్ వాడుతున్న వినియోగదారులు ఇతరులకు రూ.1 చెల్లిస్తే 51 రూపాయల క్యాష్ బ్యాక్ వెంటనే పొందుతారు. ఇలా ప్రతి ఐదు లావాదేవీలకు 51 రూపాయల మొత్తంగా రూ. 255 పొందనున్నారు.
Also Read: Corona Updates: అదుపులో కరోనా.. 24 గంటల్లో 12,830 కేసులు.. 446 మరణాలు నమోదు
వాట్సాప్ పేమెంట్స్ పరంగా యూసర్లను ఆకర్షించి, యూజర్ బేస్ ను పెంచుకోవాలని వాట్సాప్ ఈ తరహా ప్రమోషన్ లని ప్రారంభించింది. వాట్సాప్ పేమెంట్స్ కు జత పరచబడిని బ్యాంకు అకౌంట్లో నేరుగా ఈ క్యాష్ బ్యాక్ జమకానుంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తరహా ఈ ఆఫర్లు వాట్సాప్ పేమెంట్స్ క్యాష్ బ్యాక్ ఎంత మేరకు ఆకర్షిస్తాయో చూడాలి.
వాట్సాప్ పేమెంట్ ఎలా చేయాలి..??
1) వాట్సాప్ పేమెంట్స్ చేయాలంటే మొదట మీ ఫోన్ లో అప్డేటెడ్ వాట్సాప్ వర్షన్ ఉండాలి. ఒక వేళ లేకపోతే ప్లే స్టోర్ లో అప్డేట్ చేసుకోండి
2) వాట్సప్ అప్డేట్ అయ్యాక చాట్ లో చూస్తే మీకు "₹" సింబల్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేసిన తరువాత ఇతర పేమెంట్స్ యాప్ లలో చేసిన విధంగా యూపీఐ బ్యాంకు అకౌంట్ ను సెట్ చేసుకోవాలి.
3) ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉన్న నంబర్ పైనే వాట్సప్ అకౌంట్ కూడా ఉండాలి.
Also Read: Niloufer Hospital Hyderabad: హైదరాద్ లో దారుణం.. 100 రూపాయల కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్ బాయ్
4) యూపీఐ వెరిఫికేషన్ కోసం మీ మొబైల్ నంబర్ నుండి ఒక మెసేజ్ వెళ్తుంది.
5) వెరిఫికేషన్ పూర్తీ అయిన తరువాత వాట్సాప్ చాట్ నుండే మీరు పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి