SBI Interest Rate: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపధ్యంలో వడ్డీరేట్లను పెంచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెపో రేటు పెరగడం కొంతమందికి భారమైతే..మరి కొంతమంది లాభం కల్గిస్తుంది. గత నెల రోజుల వ్యవధిలో ఆర్బీఐ రెండవసారి రెపో రేటు పెంచింది. తాదాగా 50 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. ఈ క్రమంలో వడ్డీరేట్లు భారీగా పెరగనున్నాయి. ద్వైమాసిక సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ప్రభావం అటు రుణాలపై, ఇటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పడనుంది. ఈఎంఐలు భారంగా మారనుంటే..ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు అధిక వడ్డీ లభించనుంది. 


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేపధ్యంలో ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచనున్నట్టు వెల్లడించింది. ఎస్బీఐ ప్రస్తుతం 12-24 నెలల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.10శాతం వడ్డీ అందిస్తుంది. అటు 3-5 ఏళ్ల డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీ ఇస్తోంది. ఇప్పుడు రెపో రేటు పెరిగిన నేపధ్యంలో వడ్డీ రేట్లను మరింత పెంచనుంది. అయితే ఏ మేరకనేది ఇంకా తెలియలేదు. 


Also read: Railway Luggage Rules: లగేజ్ విషయంలో మరోసారి అడ్వైజరీ జారీ చేసిన రైల్వేశాఖ, ఎంత బరువంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook