Google Maps యాప్ ను తెలియని ప్రాంతాలకు దారులు తెలుసుకునేందుకు ఉపయోగిస్తారు. అయితే గూగుల్ మ్యాప్స్ యాప్ ద్వారా కూడా సంపాదించవచ్చని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే! ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆర్జించవచ్చు. మీ దగ్గర్లోని ఉన్న ప్రత్యేక స్థలాలు, వాటి గురించి వివరిస్తూ గూగుల్ మ్యాప్స్ కు సమాచారం అందించడం వల్ల డబ్బును సంపాదించవచ్చు. గూగుల్ మ్యాప్స్ బిజినెస్ వెరిఫికేషన్‌కు సంబంధించి కొత్త పాలసీని గూగుల్ అమలు చేసింది. అయితే ఈ యాప్ ద్వారా ఇంట్లో కూర్చొని పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Google Maps నుండి ఎలా సంపాదించాలి?


కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. మీరు Google Maps యాప్ ను ఉపయోగిస్తుంటే, అయితే మీ చుట్టు పక్కల ఉన్న వ్యాపారాలను గూగుల్ ధ్రువీకరించని వాటిని మీరు ముందుగా కనుగొనాల్సి ఉంటుంది. ఆ వ్యాపారాన్ని గూగుల్ మ్యాప్స్ లో నమోదు చేసేందుకు మీరు కేవలం సహాయం చేస్తే చాలు. అందుకోసం మీరు సదరు వ్యాపార యజమానులకు ఈ-మెయిల్ పంపించాల్సి ఉంటుంది. అందులో వ్యాపారాన్ని గూగుల్ మ్యాప్స్ లో ఎలా నమోదు చేయాలో యజమానికి ఆ మెయిల్ వివరిస్తుంది. 


50 డాలర్ల వరకు సంపాదన!


గూగుల్ ప్రవేశ పెట్టిన ఈ కొత్త విధానం ద్వారా.. గూగుల్ మ్యాప్స్ ను ధ్రువీకరించని వ్యాపారాన్ని గుర్తించి, దాన్ని గూగుల్ కు సిఫారసు చేస్తే దాన్ని యాప్ లో కనిపించే విధంగా చేస్తారు. ఒకవేళ ఆ వ్యాపారాన్ని సదరు యజమాని ధ్రువీకరించకపోతే.. కొన్ని రోజుల తర్వాత అది తొలగించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీరు ఆ వ్యాపారాన్ని గుర్తించడంలో సహాయం చేసినట్లు ఉంటుంది. అదే సమయంలో ఆ పని చేసినందుకు గానూ, మీకు 20 డాలర్ల నుంచి 50 డాలర్ల వరకు అంటే రూ.3,700 పైగా డబ్బును సంపాదించవచ్చు.   


Also Read: Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపు.. రూ.764 ధరకే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి!


Also Read: Amazon AC Sale: సమ్మర్ వచ్చేస్తోంది.. రూ.4,687 ధరకే ఎయిర్ కండిషనర్.. ఈరోజే తుదిగడువు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook