Google pay: ఇటీవల ఎక్కడ చూసినా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. కరోనా కంటే ముందే గూగుల్ పే వంటి కొన్ని యూపీఐలు అందుబాటులో ఉన్నా..కరోనా సంక్షోభం నుంచి యూపీఐ వినిమయం బాగా పెరిగింది. గూగుల్ పే స్థానం ఇందులో ప్రత్యేకమని చెప్పాలి. గూగుల్ పే ఇప్పుడు యూజర్లకు మరో కొత్త సేవ అందిస్తోంది. అదే యూపీఐ లైట్. ఇదెలా పనిచేస్తుందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిజిటల్ పేమెంట్స్ పెరిగిన తరువాత మార్కెట్‌లో వివిధ రకాల యూపీఐలు అందుబాటులో వచ్చాయి. ఇందులో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే ఇలా చాలా రకాలున్నాయి. అత్యధికంగా వినియోగించేవాటిలో గూగుల్ పే, ఫోన్ పే ఉంటాయి. గూగుల్ పే ఇప్పుడు తన యూజర్ల కోసం కొత్త సేవ ప్రారంభించింది. ఇదే యూపీఐ లైట్. వాస్తవానికి ఆర్బీఐ 2022 సెప్టెంబర్ నెలలో యూపీఐ లైట్ పేరుతో కొత్త పేమెంట్స్ వ్యవస్థను ప్రారంభించింది. ఇందులో పిన్ అవసరం లేకుండా చిన్న చిన్న లావాదేవీల్ని క్షణాల్లో పూర్తి చేయవచ్చు. ఈ లావాదేవీలు విఫలం అవడం ఉండదు. అయితే ఈ యూపీఐ లైట్ పేమెంట్స్‌కు పరిమితి ఉంటుంది. ఒకసారికి 200 రూపాయల వరకే పేమెంట్ చేయగలరు. యూపీఐ లైట్ కూడా యూజర్ల బ్యాంక్ ఎక్కౌంట్‌కు లింక్ అయి ఉంటుంది. రియల్ టైమ్‌లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థతో లింక్ లేకపోయినా ఈ ఫీచర్ పనిచేస్తుంది. పిన్ అవసరం లేకుండా జరిపే పేమెంట్ కావడంతో చెల్లింపులు మరింత సులభతరమౌతాయి. 


యూపీఐ లైట్ ఫీచర్ కోసం ముందుగా యాపీఐ యాప్ ఓపెన్ చేసి..స్క్రీన్‌పై టాప్ రైట్ కార్నర్‌లో ఉండే ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేయాలి. కిందకు స్క్రోల్ చేస్తుంటే..యూపీఐ లైట్ అనే ఆప్షన్ కన్పిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే కొత్త స్క్రీన్ ఓపెన్ అయి..యూపీఐ లైట్ వివరాలుంటాయి. ఈ వివరాల్ని పరిశీలించాక యూపీఐ లైట్ యాక్టివేట్ కోరుతుంది. ఆ తరువాత బ్యాంక్ ఎక్కౌంట్‌ను లింక్ చేసి అక్కడ కన్పించే సూచనలు పాటించాలి. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక నిర్దారణ మెస్సేజ్ వస్తుంది. ఆ తరువాత మీ ఎక్కౌంట్‌లోకి డబ్బుల్ని యాడ్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్‌ను ఇటీవలే పేటీఎం, ఫోన్ పేలు ప్రారంభించాయి.


Also read: What is Property Mutation: ప్రాపర్టీ కొంటే రిజిస్ట్రేషన్ చేయిస్తే సరిపోదా ? మ్యుటేషన్ అంటే ఏంటి ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook