Government to own 35.8% stake in Vodafone Idea after converting dues : దేశంలో మూడో అతి పెద్ద టెలిఫోన్ ఆపరేటర్‌గా ఉన్న వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (Vodafone Idea) నుంచి కీలక ప్రకటన వచ్చింది. కంపెనీలోని (Company) మేజర్‌ వాటాను (Major share) ప్రభుత్వానికి (Government) అప్పగించినట్లు అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ చేసింది వొడాఫోన్‌ ఐడియా కంపెనీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చాక వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం (35.8 per cent) వాటా గవర్నమెంట్ (government) చేతుల్లోకి వెళ్లింది. వ్యవస్థాపకులతో పాటు కంపెనీ ప్రస్తుత షేర్‌ హోల్డర్లందరిపై ఇది ప్రభావం చూపనుంది. కాగా వినియోగదారులను భారీగా కోల్పోతుండడం, అలాగే పెద్దగా లాభదాయక పరిస్థితులు కనిపించకపోవడం వల్ల ఈ చర్య తప్పడం లేదంటూ కంపెనీ పేర్కొంటోంది. 


స్టాక్ ఎక్స్ఛేంజ్ (Stock exchange) ఫైలింగ్‌లో ఈ వివరాలన్నింటినీ వొడాఫోన్ ఐడియా తెలిపింది. తాజాగా జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (Board of Directors) మీటింగ్‌లో ప్రభుత్వ వాటాకు అంగీకారం లభించింది. 


Also Read : IPL New Sponsor: ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్.. తప్పుకున్న వివో!


యూకేకు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌ (Vodafone Group) పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీకి 28.5 శాతం వాటా ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా (Aditya Birla) గ్రూప్‌నకు 17.8 శాతం వాటా ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం (Government of India) 35.8 శాతం వాటాతో నిర్ణయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కించుకుంది. మొత్తానికి ప్రభుత్వ (Government) ఆధీనంలోకి వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) వెళ్లి పోయింది. ఇక ఈ పరిణామం తర్వాత తాజా స్టాక్‌ సూచీల్లో వొడాఫోన్‌ ఐడియా షేర్లు దారుణంగా పడిపోయాయి.


Also Read : Ananya Pandey Latest Pics: బీచ్ లో ఒంటరిగా సేదతీరుతున్న లైగర్ బ్యూటీ అనన్యా పాండే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి