IPL New Sponsor: ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్.. తప్పుకున్న వివో!

IPL New Sponsor 2022: ఐపీఎల్ కొత్త టైటిల్​ స్పాన్సర్​ షిప్​ను టాటా గ్రూపునకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది బీసీసీఐ. వివో ఈ కాంట్రాక్టు నుంచి తప్పుకొనేందుకు అంగీకరించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 03:05 PM IST
    • ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్
    • అధికారిక ప్రకటన చేసిన ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్
    • టైటిల్ స్పాన్సర్ గా రెండేళ్ల ముందే తప్పుకున్న వివో
IPL New Sponsor: ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్.. తప్పుకున్న వివో!

IPL New Sponsor 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్ ఉండబోతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా టైటిల్ స్పాన్సర్ గా ఉంటున్న వివో (VIVO) స్థానంలో టాటా గ్రూప్ ఎంపికైందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచే టాటా గ్రూప్ సంస్థ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుందని బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. 

"అవును, వివో స్థానంలో టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది జరగనున్న IPL 2022 లీగ్ నుంచి అమలు కానుంది" అని బ్రిజేష్ పటేల్ ANIకి చెప్పారు. 

అయితే చైనా మొబైల్ కంపెనీ వివోతో టైటిల్ స్పాన్సర్ షిప్ ఒప్పందాన్ని ఐపీఎల్ కుదుర్చుకుంది. అయితే ఒప్పందం ప్రకారం మరో రెండేళ్లు వివో టైటిల్ స్పాన్సర్ గా కొనసాగాల్సింది. కానీ, ఆ కాంట్రాక్టు నుంచి వివో తప్పకోవడం వల్ల టాటా గ్రూప్ ఇప్పుడా స్థానంలో రానుందని తెలుస్తోంది. 

ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో..

మంగళవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో టైటిల్ స్పాన్సర్ గా వివోను మార్పు చేస్తున్న విషయాన్ని నిర్ణయించారు. చైనా దేశానికి చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో రెండేళ్ల ముందుగానే టైటిల్ స్పాన్సర్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు చర్చ జరిగింది. దీంతో వివో స్థానంలో టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్ గా ఉంటుందని సమావేశంలో తీర్మానం జరిగింది. 

ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్-2022 నుంచి మరో రెండు కొత్త జట్లు చేరనున్నాయి. లక్నో, అహ్మదాబాద్ వంటి కొత్త ఫ్రాంచైజీలు ఈ సారి లీగ్ లో చేరనున్నాయి. ఈ రెండు టీమ్స్ చేరికతో ఐపీఎల్ ట్రోఫీ కోసం పోటీ పడే జట్లు 10కి చేరాయి. 

Also Read: Harbhajan on Kohli: సౌతాఫ్రికాతో మూడో టెస్టులో వింటేజ్ కోహ్లీని చూస్తారు: హర్భజన్

ALso Read: IPL 2022: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ నేడే, మెగా ఆక్షన్, ఐపీఎల్‌‌పై కీలక నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News