September Vehicles Sales: పండుగల సందర్భంగా వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయి. గత నెలలో దేశవ్యాప్తంగా వాహనాల విక్రయాలు 20 శాతం పెరిగినట్లు ఫెడరేషన్ ఆఫ్ వెహికల్ డీలర్ అసోసియేషన్స్ (FADA) వెల్లడించింది. సెప్టెంబరులో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 18,82,071 యూనిట్లకు చేరుకుందని తెలిపింది. గతేడాది ఇదే నెలలో 15,63,735 యూనిట్లుగా ఉంది. ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు మనీష్‌ రాజ్ సింఘానియా మాట్లాడుతూ.. సెప్టెంబరులో వాహనాల విక్రయాలు భారీగా పెరిగిందని తెలిపారు. అన్నారు. ద్విచక్ర వాహనాల విక్రయాలు 22 శాతం పెరగ్గా.. త్రీవీలర్ల రిటైల్ విక్రయాలు 49 శాతం పెరిగినట్లు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 19 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. వాణిజ్య వాహనాల విక్రయాలు ఐదు శాతం పెరిగాయన్నారు. గత నెలలో ట్రాక్టర్ల విక్రయాల్లో 10 శాతం తగ్గుదల నమోదైందని చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్ 19 శాతం కంటే ఎక్కువ పెరిగిందని.. 3,32,248 యూనిట్లకు చేరుకున్నాయి, సెప్టెంబర్ 2022లో 2,79,137 యూనిట్లు ఉన్నాయి.


మార్కెట్‌లోకి కొత్త ప్రొడక్ట్‌లను తీసుకువరావడంతో గత నెలలో కూడా వాహనాల ఆఫ్‌టేక్ పెరిగిందని సింఘానియా తెలిపారు. టూ వీలర్ వెహికల్స్‌ రిటైల్ సేల్స్ 22 శాతం పెరిగి.. 13,12,101 యూనిట్లకు చేరుకున్నాయన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో 10,78,286 యూనిట్లుగా ఉందన్నారు. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ ఐదు శాతం పెరిగి 80,804 యూనిట్లకు చేరుకుందని చెప్పారు. గతేడాదిలో 68,937 యూనిట్లతో పోలిస్తే త్రీ వెహికల్ సేల్స్‌ 49 శాతం పెరిగి.. 1,02,426 యూనిట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2022లో ట్రాక్టర్ విక్రయాలు 60,321 యూనిట్ల నుంచి 54,492 యూనిట్లకు తగ్గాయి.


పండగ సీజన్‌లో మొత్తం 42 రోజుల కాలంలో అమ్మకాలపై తాము ఆశాజనకంగా ఉన్నామన్నారు. వాహన రిటైల్ రంగానికి ఈ పండుగ సీజన్ అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాము. గత నెలలో దేశవ్యాప్తంగా ఉన్న 1,440 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో 1,352 వాహనాల రిజిస్ట్రేషన్ డేటాను తాము సేకరించినట్లు వెల్లడించారు.


Also Read: Assembly Elections 2023 Live Updates: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఫలితాలు ఎప్పుడంటే..?  


Also Read: CM KCR: ఎన్నికల రంగంలోకి సీఎం కేసీఆర్.. ఆ రోజే మేనిఫెస్టో ప్రకటన  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి