CM KCR: ఎన్నికల రంగంలోకి సీఎం కేసీఆర్.. ఆ రోజే మేనిఫెస్టో ప్రకటన

Telangana Assembly Election 2023: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ రానుంది.

Written by - Ashok Krindinti | Last Updated : Oct 9, 2023, 06:07 PM IST
CM KCR: ఎన్నికల రంగంలోకి సీఎం కేసీఆర్.. ఆ రోజే మేనిఫెస్టో ప్రకటన

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేయడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో బిజీ అవుతున్నాయి. అభ్యర్థుల ప్రకటనతో ఇప్పటికే ఎన్నికల రంగంలోకి దిగిన బీఆర్ఎస్.. మేనిఫెస్టోను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ఈ నెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్రి సమావేశం నిర్వహించనున్నారు. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అభ్యర్థులకు  అందజేయనున్నారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారు. అక్టోబర్ 15, 16, 17, 18వ తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటించారు. నవంబర్ 9న రెండు చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు.

ఈ నెల 15న జరిగే సమావేశంలో ఎన్నికల్లో పాటించాల్సిన విషయాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం అదేరోజున హైదరాబాద్ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  సాయంత్రం 4 గంటలకు ప్రసంగించారు.

==> అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.  

==> 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు.

==> 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

సీఎం కేసీఆర్ నామినేషన్లు ఇలా..

నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం 3  గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

Also Read: Assembly Elections 2023 Live Updates: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఫలితాలు ఎప్పుడంటే..?  

Also Read: TTD News: తీపికబురు అందించిన టీటీడీ.. వారికి జీతాలు పెంపు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News