NTPC Green Energy IPO: ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన NTPC గ్రీన్ ఎనర్జీ ఐపీఓ కింద షేర్ల కేటాయింపు సోమవారం పూర్తి అయ్యింది. ఈ IPO లిస్టింగ్ నవంబర్ 27న జరుగుతుంది.  ఈ కంపెనీ షేర్లు ఎవరి డీమ్యాట్ ఖాతాలో కేటాయించారో  నవంబర్ 25న విడుదల చేసింది. ఈ IPO నవంబర్ 19 నుండి ప్రారంభించిన షేర్ల కేటాయింపు, డబ్బు పెట్టుబడి పెట్టడానికి చివరి అవకాశం నవంబర్ 22. రూ.10,000 కోట్ల విలువైన ఈ ఏడాదికి ఇది మరో పెద్ద ఐపీఓ. ఇష్యూలో రూ.92.59 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేశారు. ఈ IPO సబ్‌స్క్రిప్షన్ చివరి రోజున 2.4 సార్లు పూరించింది. ఇప్పుడు మీరు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఈ కంపెనీ షేర్లు కేటాయించారో  లేదా అనే దాని గురించి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NTPC గ్రీన్ ఎనర్జీ IPO: కేటాయింపు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? 


ఇది BSE వెబ్‌సైట్ ద్వారా జరిగే ప్రక్రియ: 


- ముందుగా BSE వెబ్‌సైట్‌లో అప్లికేషన్ చెక్ పేజీలోకి వెళ్లండి. 


-డ్రాప్ డౌన్ మెను నుండి NTPC గ్రీన్ ఎనర్జీని సెలక్ట్ చేసుకోండి. 


-అప్లికేషన్ నంబర్ లేదా పాన్ నంబర్‌ను ఎంటర్ చేయండి. 


KFin టెక్నాలజీస్ పోర్టల్ ద్వారా అయితే 


-KFin టెక్నాలజీస్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. 


-NTPC గ్రీన్ ఎనర్జీని సెలక్ట్ చేసుకోండి. 


-పాన్ వివరాలను ఎంటర్  చేసి కంటిన్యూ అవ్వండి. 


NTPC గ్రీన్ ఎనర్జీ IPO వివరాలు : 


NTPC గ్రీన్ ఎనర్జీ అనేది దేశంలోని అతిపెద్ద విద్యుత్ సంస్థ NTPCకి అనుబంధ సంస్థ. NTPC గ్రీన్ ఎనర్జీ IPO పరిమాణం 10 వేల కోట్లు.  ఈ IPO నవంబర్ 19న ప్రారంభమైంది మరియు నవంబర్ 22 వరకు తెరిచి ఉంది. ఇష్యూ కింద 92.59 కోట్ల తాజా షేర్లు జారీ అయ్యాయి.  కంపెనీ ఐపీఓ ధరను రూ.102 నుంచి రూ.108గా నిర్ణయించింది. కనిష్ట లాట్ పరిమాణం 138 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.14,904 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది నవంబర్ 27న లిస్టింగ్ అవుతుంది. ఈ పెట్టుబడిలో దాదాపు 20 శాతం ఈక్విటీ నుంచి వస్తుందని ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ తెలిపారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter