Hero Eddy electric scooter: రూ.72 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రిజిస్ట్రేషన్, లైసెన్స్‌తో పనే లేదు!
Hero Eddy electric scooter: హీరో ఎలక్ట్రిక్ నుంచి సరికొత్త బడ్జెట్ ఈ-స్కూటర్ అందుబాటులోకి రానుంది. ఈ విద్యుత్ స్కూటర్‌ను నడిపేందుకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరమేలేదట. స్కూటర్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Hero Eddy electric scooter: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ.. హీరో ఎలక్ట్రిక్ భారత మార్కెట్లోకి సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. ప్రత్యేకించి తక్కువ దూరాల ప్రయాణాలకు అనువుగా.. ఈ కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఈ స్కూటర్‌ను నడిపేందుకు లైసెన్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదట. అంతే కాదు.. ఈ స్కూటర్‌ను రిజిస్ట్రేషన్ చేయించాల్సిన పని కూడా లేదు.
కమ్యునిటీలో తిరిగేందుకు లేదా దగ్గర్లోని స్టోర్లకు, కాఫీ షాప్‌లకు వెళ్లేందుకు వీలుగా ఈ స్కూటర్‌ను విడుదల చేసినట్లు పేర్కొంది హీరో ఎలక్ట్రిక్.
హీరో ఎడ్డి స్కూటర్ ధర..
హీరో ఎడ్డి ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.72 వేలు (ఢిల్లీ ఎక్స్ షోరూం)గా నిర్ఱణయించింది కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పసుపు, లేత నీలి రంగులో కొనుగోలుకు చేసేందుకు వీలుంది.
ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య ఈ స్కూటర్ కొనుగోళ్లకు అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ వెల్లడించింది కంపెనీ. త్వరలోనే ప్రీ బుకింగ్స్‌కు అందుబాటులోకి వచ్చే వీలుంది.
హీరో ఎడ్డి స్కూటర్ ఫీచర్లు..
హీరో ఎలక్ట్రిక్.. ఎడ్డి స్కూటర్ ఫీచర్లు అన్నింటిని విడుదల చేయలేదు. సాధారణంగా గరిష్ఠ వేగం గంటకు 25 కిలో మీటర్లకన్నా తక్కువగా ఉంటే అలాంటి వాహనాలకు దేశంలో లైసెన్స్ అక్కర్లేదు. ఈ స్కూటర్ కూడా ఆ జాబితాలోకే వస్తుంది.
అయితే ఈ కొత్త స్కూటర్‌కు లైసెన్స్ అవసరం లేదు అని ప్రకటించిన కంపెనీ.. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
ఇందులో ఫైండ్ మై బైక్, ఫాలో మీ హెడ్ ల్యాప్, రివర్స్ మోడ్, , ఈ-లాక్ వంటి అధునాత ఫీచర్లును పొందు పరిచినట్లు మాత్రం కంపెనీ తెలిపింది. ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ బైక్‌కు సంబంధించిన ఫీచర్లను ప్రకటించే వీలుంది. ఈ బైక్ విడుదలపై మీడియాతో మాట్లాడిన హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్.. ఈ కొత్త స్కూటర్‌ను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించడానికి థ్రిల్‌గా ఉన్నట్లు చెప్పారు. ఈ బైక్ పర్యావరణ హితంగా, స్మార్ట్, స్టైలిష్ ఫీచర్లతో రానుందని వివరించారు.
Also read: GST Collections February 2022: ఐదోసారీ రూ.1.30 లక్షల కోట్లపైకి జీఎస్టీ వసూళ్లు!
Also read: Satya Nadella: సత్య నాదెళ్ల ఇంట్లో తీవ్ర విషాదం.. చిన్న వయసులోనే కుమారుడు జైన్ నాదెళ్ల మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook