GST Collections February 2022: ఐదోసారీ రూ.1.30 లక్షల కోట్లపైకి జీఎస్​టీ వసూళ్లు!

GST Collections February 2022: మరోసారి జీఎస్​టీ వసూళ్లు భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలో జీఎస్​టీ ఆదాయం రూ.1.30 లక్షల కోట్లు దాటినట్లు ప్రభుత్వం అధికారిక డేటాలో వెల్లడైంది. ఇందులో అత్యధికం మహారాష్ట్ర నుంచే కావడం గమనార్హం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 02:21 PM IST
  • గత నెలలో భారీగా పెరిగిన జీఎస్​టీ వసూళ్లు
  • మరోసారి రూ.1.3 లక్షల కోట్లపైనే నమోదు
  • గత ఏడాదితో పోలిస్తే 18 శాతం అధికం
GST Collections February 2022: ఐదోసారీ రూ.1.30 లక్షల కోట్లపైకి జీఎస్​టీ వసూళ్లు!

GST Collections February 2022: వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్త్తోంది. ఫిబ్రవరిలో మొత్తం రూ.1,33,026 కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఆర్థిక శాఖ మంగళవారం ప్రకటించింది. జీఎస్​టీ ఆదాయం రూ.1.30 కోట్లకుపైగా నమోదవడం ఇది ఐదో నెల కావడం విశేషం.

మొత్తం రూ.1.33,026 కోట్ల వసూళ్లలో రూ.24,435 కోట్లు కేంద్ర జీఎస్​టీ కాగా.. రూ.30,779 కోట్లు రాష్ట్రాల జీఎస్​టీ. రూ.67,471 కోట్లు సమీకృత జీఎస్​టీ (ఇందులో కేంద్రానికి, రాష్ట్రాలకు వాటా ఉంటుంది.). సెస్సుల రూపంలో గత నెల రూ.10,340 కోట్లు ఆదాయం లభించినట్లు పేర్కొంది ఆర్థిక శాఖ.

గత నెల జీఎస్​టీ ఆదాయం రికార్డులు..

సాధారణంగా ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కాబట్టి ఆదాయం తక్కువగా నమోదుతుంది. కానీ ఈ సారి మాత్రం ఆదాయం రికార్డు స్థాయిలో నమోదవడం విశేషం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 2021 ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో జీఎస్​టీ ఆదాయం 18 శాతం ఎక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2020 ఫిబ్రవరితో పోలిస్తే ఈ మొత్తం 26 శాతం అధికం.

ఈ రాష్ట్రాల్లో అధిక ఆధాయం..

ఫిబ్రవరిలో మహారాష్ట్రలో అత్యధికంగా రూ.19,423 కోట్ల జీఎస్​టీ ఆదాయం నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్​ నుంచి గత నెల రూ.8,873 కోట్ల జీఎస్​టీ ఆదాయం లభించింది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో జీఎస్​టీ ఆదాయం ఫిబ్రవరి 2022లో రూ.4,113 కోట్ల ఆదాయం నమోదైంది. ఆంద్ర ప్రదేశ్​లో రూ. 3,157 ఆదాయం నమోదైనట్లు ప్రభుత్వం అధికారిక డేటాలో వెల్లడైంది.

Also read: Satya Nadella: సత్య నాదెళ్ల ఇంట్లో తీవ్ర విషాదం.. చిన్న వయసులోనే కుమారుడు జైన్‌ నాదెళ్ల మృతి..

Also read: iPhones price drop: ఐఫోన్​ లవర్స్​కు గుడ్​ న్యూస్​- కొత్త ఫోన్ రూ.15 వేలకే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News