Hero MotoCorp Two Wheelers: హీరో బైక్స్ కొనేవారికి షాకింగ్ న్యూస్
Hero MotoCorp Two Wheelers: హీరో మోటోకార్ప్... ఇండియాలో ద్విచక్ర వాహనాల్లో అత్యధిక సంఖ్యలో బైక్స్, స్కూటర్స్ విక్రయించే ఈ సంస్థ తమ కస్టమర్స్‌కి షాకింగ్ న్యూస్ చెప్పింది. మరీ ముఖ్యంగా త్వరలోనే హీరో మోటోకార్ప్ బైక్స్ కొనేవారికి ఈ షాకింగ్ న్యూస్ వర్తిస్తుంది. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే..
Hero MotoCorp Two Wheelers: హీరో మోటోకార్ప్... ఇండియాలో ద్విచక్ర వాహనాల్లో అత్యధిక సంఖ్యలో బైక్స్, స్కూటర్స్ విక్రయించే ఈ సంస్థ తమ కస్టమర్స్ కి షాకింగ్ న్యూస్ చెప్పింది. మరీ ముఖ్యంగా త్వరలోనే హీరో మోటోకార్ప్ బైక్స్ కొనేవారికి ఈ షాకింగ్ న్యూస్ వర్తిస్తుంది. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. త్వరలోనే కొన్ని ఎంపిక చేసిన బైక్స్ ధరలు పెంచనున్నట్టు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. త్వరలోనే అంటే మరెన్నో రోజులు కాదు సుమా.. హీరో మోటోకార్ప్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ వచ్చె అక్టోబర్ నెల 3వ తేదీ నుంచే ధరల పెంపు వర్తించనుంది.
ముడి సరుకులు ధరలు పెరగడం, సరుకు రవాణా, తయారీ ఖర్చులు వంటి ఇన్‌పుట్ కాస్ట్ అన్నీ కలిపి తడిసి మోపెడు అవుతున్నాయని.. పెరుగుతున్న ఖర్చులు, నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని హీరో మోటోకార్ప్ స్పష్టంచేసింది. ఒక్కో మోడల్‌ని బట్టి ఒక్కోలా ధరల పెంపు ఉంటుంది అని హీరో మోటోకార్ప్ అభిప్రాయపడింది. ఏయే వాహనాలపై ధరల పెరుగుదల వర్తిస్తుంది అనే జాబితాను ఇప్పటి ఇంకా వెల్లడించలేదు.
రేపు లేదా ఎల్లుండి హీరో మోటోకార్ప్ నుండి ఈ జాబితా వచ్చే అవకాశం ఉంది. లేదంటే చడీచప్పుడు కాకుండానే పెరిగిన ధరలతో తమ ద్విచక్రవాహనాలను విక్రయించే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే.. సర్వసాధారణంగా ధరలు తగ్గించినప్పుడు డిస్కౌంట్ అందిస్తున్నట్టుగా ప్రకటనల రూపంలో హడావుడి చేసే వ్యాపార సంస్థలు.. ధరలు పెరిగినప్పుడు మాత్రం వాటిని పెద్దగా హైలైట్ చేయడానికి ఇష్టపడవు. అలా చేస్తే అవి తమ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది అనేది వాణిజ్య సంస్థలు భావిస్తుంటాయి.
ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ద్విచక్రవాహనాల మార్కెట్ షేర్ కలిగిన కంపెనీగా హీరో మోటోకార్ప్ సంస్థకి పేరుంది. స్పెండర్ + వంటి బేసిక్ మోడల్ బైక్ నుండి మొదలుపెడితే.. ఇటీవలే కొత్తగా లాంచ్ అయిన కరిజ్మా XMR వరకు ఎన్నో వెరైటీ మోడల్ బైక్స్ హీరో మోటోకార్ప్ సొంతం. ఇవే కాకుండా హార్లే డేవిడ్సన్ X440 కూడా విక్రయిస్తోంది. అమెరికాకు చెందిన ఈ బైక్ కంపెనీతో హీరో మోటోకార్ప్ కి ఉన్న ఒప్పందం మేరకు తమ హీరో మోటోకార్ప్ బైక్స్ తో పాటే హార్లే డేవిడ్సన్ X440 బైక్స్ సైతం విక్రయిస్తోంది. ఇటీవల కొత్తగా లాంచ్ అయిన స్పోర్ట్స్ బైక్సులో 210 CC కెపాసిటీ కలిగిన కరిజ్మా XMR కూడా ఒకటి.