Hero Xoom Combat Edition: మార్కెట్‌లో ప్రముఖ హీరో కంపెనీ స్కూటర్స్‌కి ఎంత డిమాండ్‌ ఉందో అందిరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ కావడంతో అతి తక్కువ ధరలకే లభించడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త వేరియంట్‌ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. జూమ్ స్కూటర్‌ను కంపెనీ ప్రత్యేకమైన కంబాట్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కంబాట్ ఎడిషన్ ఆకర్శనీయమైన తగ్గింపుతో లభిస్తోంది. ఇక ఈ స్కూటర్‌ వివరాల్లోకి వెళితే, ఇది ధర రూ.80,967( ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. దీనిని కంపెనీ అత్యంత ప్రీమియం మ్యాట్ షాడో గ్రే కలర్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనికి బేస్ గ్రే కోట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రత్యేకమైన ఎడిషన్‌లో యుద్ధ విమానాలలో కనిపించే రంగులను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఎడిషన్‌ ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. 


హీరో జూమ్ కంబాట్ ఎడిషన్ వివిధ వేరియంట్స్‌ల వారిగా ధరల వివరాలు చూస్తే, ఈ స్కూటర్‌ హైఎండ్‌ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,967 నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో పాటు బేస్ LX వేరియంట్  రూ.71,484 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.  జూమ్ కంబాట్ ఎడిషన్ అన్ని ఫీచర్స్‌ దాదాపు ZX వేరియంట్‌ లాగే ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇది ఎంతో ప్రత్యేకమైన 110.9cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తోంది. దీంతో పాటు కార్నరింగ్ లైట్ ఫీచర్ కూడా లభిస్తుంది.


ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
110.9cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌
8.2hp శక్తి,8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డిజిటల్ డిస్‌ప్లే
బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
స్పోర్టీ లుక్
స్టైలిష్ అల్లాయ్ వీల్స్
BS6 ఇంజన్
స్పోర్టీ రైడ్‌ ఫీచర్‌
ఫ్రంట్ డిస్క్ బ్రే ఫీచర్‌
LED హెడ్‌ల్యాంప్ 
 మెరుగైన బ్రేకింగ్ సెటప్‌
డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
USB చార్జింగ్ పోర్ట్
ట్యుబ్‌లెస్ టైర్లు


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి