High Profits Returns Stocks: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా ? మంచి లాభాలు ఇచ్చే స్టాక్స్ కోసం అన్వేషిస్తున్నారా ? వీలైతే సుదీర్ఘ కాలం పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారా ? ఐతే ఇది మీ కోసమే. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు ఇచ్చే 5 రకాల స్టాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అధ్యయనం చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం 5 స్టాక్స్ గురించి వెల్లడించింది. ఆ 5 స్టాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ : 
ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ రూ. 199 వద్ద ట్రేడ్ అవుతుండగా.. రాబోయే ఏడాది కాలంలో ఈ స్టాక్ రూ. 240 మార్క్ టచ్ అవుతుంది అని మోతిలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. కంపెనీ వ్యాల్యూయేషన్స్, లాభాలు, ఆదాయం వంటి అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకునే ఈ అంచనా వేసినట్టు మోతిలాల్ ఓజ్వాల్ వెల్లడించింది.


టాటా మోటార్స్ షేర్స్ : 
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దూకుడు ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్ కంపెనీ స్టాక్ మార్కెట్లో కూడా అంతే దూకుడు మీద ఉంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ కంపెనీ షేర్స్ 634 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా.. రాబోయే ఏడాదిలో ఈ షేర్ వ్యాల్యూ రూ. 750 కి చేరుకుంటుంది అని మోతిలాల్ ఓజ్వాల్ అంచనా వేస్తోంది.


ఐటిసి స్టాక్స్ :
ఇండియన్ స్టాక్ మార్కెట్లో డివిడెండ్స్ పరంగా స్థిరమైన ఆదాయం ఇచ్చే షేర్స్ లో ఐటిసి కంపెనీ కూడా ఒకటి అనే పేరున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఐటిసి కంపెనీ షేర్స్ 444 రూపాయలుగా ఉండగా.. వచ్చే ఏడాది కాలంలో ఈ స్టాక్ వ్యాల్యూ రూ. 535 కి తాకుతుంది అని మోతిలాల్ ఓజ్వాల్ స్పష్టంచేసింది.


డిమార్ట్ స్టాక్స్ : 
ఇప్పుడున్న ట్రెండీ ప్రపంచంలో ఒక ఇంటికి అవసరమైన అన్ని రకాల నిత్యావసరాల సరుకులతో పాటు అన్ని రకాల వస్తుసామాగ్రి కొనుగోలుకు కేంద్రంగా నిలిచిన సూపర్ మార్కెట్ గురించి తెలియని వారు లేరు. అలాగే స్టాక్ మార్కెట్లోనూ డిమార్ట్ ఒక సక్సెస్‌ఫుల్ ట్రెండింగ్ స్టాక్. ఎప్పటికప్పుడు న్యూ హైట్స్ టచ్ చేస్తూ వెళ్తున్న డిమార్ట్ స్టాక్ ఇప్పుడు 3796 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా.. రాబోయే ఏడాదిలో డిమార్ట్ షేర్స్ రూ. 4,420 మార్క్ తాకుతుంది అని మోతిలాల్ ఓజ్వాల్ అంచనాలు చెబుతున్నాయి. 

ఐసిఐసిఐ లాంబర్డ్ షేర్స్ :
ఐసిఐసిఐ లాంబర్డ్ షేర్స్ ప్రస్తుతం 1350 రూపాయలు వద్ద ట్రేడ్ అవుతుండగా.. దీర్ఘ కాలంలో ఈ స్టాక్ 1550 రూపాయల వరకు చేరుకుంటుంది అని మోతిలాల్ ఓజ్వాల్ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 


గమనిక : ఇక్కడ పేర్కొన్న స్టాక్స్ అన్నీ ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ ఫమ్ మోతిలాల్ ఓజ్వాల్ అంచనాల మేరకే వెల్లడించడం జరిగింది కానీ ఇందులో జీ తెలుగు న్యూస్ సొంత అభిప్రాయాలు లేవు అని గమనించగలరు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ఆయా స్టాక్స్ గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత కానీ లేదా మీ బిజినెస్ అడ్వైజర్ తో చర్చించిన తరువాత కానీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోగలరు.