Highest Selling Cars: కారు కొనడం అంటే అది కేవలం క్యాష్ ఉంటేనో లేక కారు లోన్‌కి ఎలిజిబిలిటీ ఉంటేనో సరిపోతుందని ఎవ్వరూ అనుకోరు. క్యాష్, కారు లోన్ కంటే ముందుగా ఎలాంటి కారు అయితే బాగుంటుంది, ఏ కారు కొంటే సౌకర్యంగా ఉంటుంది, ఎలాంటి కారు అయితే సురక్షితంగా ఉంటుంది అనేది ఎంతో అధ్యయనం చేస్తారు. ఇవన్నీ పరిశీలించే ముందు చాలా మంది పరిగణనలోకి తీసుకునే మరో అంశం ప్రస్తుతం ఏ బ్రాండ్‌కి చెందిన ఏ కారు ఎక్కువగా అమ్ముడవుతోంది అని. ఎందుకంటే ఒక కారు ఎక్కువగా అమ్ముడవుతోంది అంటే.. ఆ కారుపై అంతమంది ముందుగా పరిశీలించి ఆ కారుపై నమ్మకం ఉంటేనే కొనుగోలు చేస్తారు కాబట్టి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ మీరు కూడా కారు కొనుగోలు చేసే ప్లాన్ లో ఉన్నారా ? అయితే మీకు రిస్కే లేకుండా 2023 జనవరిలో ఏ బ్రాండ్ కార్లు ఎక్కువగా సేల్ అయ్యాయి, అందులోనూ ఏ మోడల్ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి అని ఫుల్ డీటేల్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. 


మారుతి సుజుకి 
ఇండియాలోనే లార్జెస్ట్ కార్ మేకర్‌గా పేరున్న మారుతి సుజుకి 2023 జనవరిలో అత్యధికంగా కార్లు విక్రయించిన బ్రాండ్స్ జాబితాలో టాప్ పొజిషన్‌లో నిలిచింది. గత నెలలో ఈ కార్ల కంపెనీ మొత్తం 1,47,348 కార్లు విక్రయించింది. 2022 జనవరిలో.. అంటే సరిగ్గా ఏడాది క్రితం ఇదే మారుతి సుజుకి మొత్తం 1,28,924 కార్లు విక్రయించింది. వార్షికంగా 14.30 శాతం వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి ఆల్టో 800, ఆల్టో 800, వాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, సియాజ్, ఎక్స్ఎల్-6, బ్రెజ్జా, గ్రాండ్ వితారా, ఇగ్నైస్, ఈకో, ఎర్టిగా వంటి కార్లను మారుతి సుజుకి విక్రయిస్తోంది.  


హ్యూందాయ్
2023 జనవరి నెలలో అత్యధికంగా కార్లు విక్రయించిన బ్రాండ్స్ జాబితాలో హ్యూందాయ్ రెండో పొజిషన్‌లో నిలిచింది. గత నెలలో ఈ కంపెనీ 50,106 కార్లు విక్రయించింది. 2022 జనవరిలో ఇదే కంపెనీ 44,022 కార్లు విక్రయించింది. హ్యూందాయ్ కార్ల విక్రయాలలో వార్షికంగా చూసినా, నెల వారీ పరంగా చూసినా 29 శాతం వృద్ధి నమోదైంది. హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యూందాయ్ క్రెటా, హ్యూందాయ్ వెన్యూ, హ్యూందాయ్ ఆరా, హ్యూందాయ్ అల్కాజార్, హ్యూందాయ్ టక్సన్, హ్యూందాయ్ కోన ఈవి, హ్యూందాయ్ అయోనిక్ 5 ఈవి వంటి కార్లను హ్యూందాయ్ మోటార్స్ ఇండియా విక్రయిస్తోంది.


టాటా మోటార్స్
2023 జనవరి నెలలో అత్యధికంగా కార్లు అమ్మిన బ్రాండ్స్ జాబితాలో దేశీ కార్ల తయారీ బ్రాండ్ టాటా మోటార్స్ మూడో స్థానం సొంతం చేసుకుంది. టాటా మోటార్స్ ఈ జనవరి నెలలో 47990 కార్లు విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది టాటా మోటార్స్ కార్ల సేల్స్‌లో 17.70 శాతం వృద్ధి నమోదైంది. టాటా టియాగో, టాటా టిగోర్, టాటా ఆల్ట్రోజ్, టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా హ్యారియర్, టాటా సఫారి, టాటా నెక్సాన్ ఈవి, టియాగో ఈవి, టిగోర్ ఈవి కార్లను విక్రయిస్తోంది. సేఫ్టీ పరంగా మిగతా బ్రాండ్స్ కార్లతో పోల్చితే.. టాటా మోటార్స్ తయారు చేస్తోన్న కార్లు టాప్ పొజిషన్‌లో నిలిచాయి.


మహీంద్రా అండ్ మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా బ్రాండ్ జనవరి నెలలో 33,040 కార్లు విక్రయించి ఈ జాబితాలో నాలుగో స్థానం కైవసం చేసుకుంది. మహీంద్రా థార్, మహీంద్రా ఎక్స్‌యూవి 300, మహీంద్రా ఎక్స్ యూవి 400 ఈవి, ఎక్స్ యూవి 700, స్కార్పియో N, స్కార్పియో క్లాసిక్, మహీంద్రా మరాజో కార్లను మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయిస్తోంది. నెల నెల ఈ కంపెనీ కార్ల విక్రయాలలో సగటున 16.6 శాతం వృద్ధి కనిపిస్తోంది. 


కియా ఇండియా కార్లు
ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచిన కార్ల కంపెనీ కియా ఇండియా. కియా 2023 జనవరిలో 28,264 కార్లు విక్రయించింది. ఇదే కంపెనీ 2022 జనవరిలో 19,319 కార్లు విక్రయించింది. నెల వారీ పరంగా 88.60 శాతం వృద్ధి నమోదైంది. కియా సోనెట్, సెల్టోస్, కేరెన్స్, కార్నిలాల్ ఎంపివి వంటి కార్లను కియా ఇండియా విక్రయిస్తోంది. 


టోయోటా కిర్లోస్కర్ కార్ల కంపెనీ
ఆ తరువాతి స్థానంలో టోయోటా కార్ల కంపెనీ 2023 జనవరిలో 12,728 కార్లు విక్రయించింది. 2022 జనవరిలో ఇదే టయోటా కార్ల కంపెనీ 7,328 కార్లు విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది టయోటా కార్ల అమ్మకాల్లో 73.7 శాతం వృద్ధి నమోదైంది.


ఇది కూడా చదవండి : Maruti Cars Discount: కొత్తగా కారు కొనేవారికి గుడ్ న్యూస్.. మారుతి కార్లపై రూ. 46 వేల వరకు డిస్కౌంట్.. ఫుల్ డీటేల్స్


ఇది కూడా చదవండి : Oneplus 5G Smartphones: వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే మరో సూపర్ స్మార్ట్‌ఫోన్


ఇది కూడా చదవండి : Rs 39,000 Smartphone for Rs 8000: రూ. 39 వేల స్మార్ట్ ఫోన్ జస్ట్ రూ. 8 వేలకే.. బంపర్ ఆఫర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook