Top 5 best-selling two-wheeler in February 2023: ఫిబ్రవరి నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఈసారి అమ్మకాల పరంగా 18 శాతం వృద్ధి కనిపించింది. 2022 ఫిబ్రవరిలో 7,03,228 ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోగా.. ఈ ఫిబ్రవరి నెలలో 8,29,810 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. 1,26,582 వాహనాలు అధికంగా అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2023లో హీరో కంపెనీ నుంచి అతి తక్కువ ధర కలిగిన మోడల్ బైక్ 2.8 లక్షల కంటే ఎక్కువ సంఖ్యలో అమ్ముడుపోయింది. బైక్స్ అమ్మకాల్లో దాదాపు 50 శాతం వృద్ధిని కనబర్చిన ఈ ఒక్క బైక్ ఇతర అన్ని కంపెనీల బైక్స్, స్కూటర్‌ల కంటే ఎక్కువగా అమ్ముడైన బైక్ గా రికార్డు సొంతం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెస్ట్ సెల్లింగ్ టూ-వీలర్..


1. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ టాప్ మోస్ట్ సెల్లింగ్ బైక్ మరేదో కాదు.. గతంలోనూ పలు సందర్భల్లో అత్యధికంగా అమ్ముడైన బైక్స్ జాబితాలో నిలిచిన హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ బైక్. ఫిబ్రవరి 2023లో 2,88,605 బైక్స్‌ని విక్రయించి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా రికార్డు సొంతం చేసుకుంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఫిబ్రవరి నెలలో 1,93,731 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఈ ఏడాది వ్యవధిలో 49 శాతం వృద్ధి నమోదైంది. ఈ బైక్ ధర కేవలం 72 వేల రూపాయల నుంచే ప్రారంభమవుతుండటం మరో విశేషం.


2. అత్యధిక సంఖ్యలో అమ్ముడైన ద్విచక్ర వాహనాల జాబితాలో హోండా యాక్టివా స్కూటర్ రెండో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2023లో హోండా యాక్టివా అమ్మకాలు 20.08 శాతం పెరిగాయి. ఈ ఫిబ్రవరి నెలలో  1,74,503 యూనిట్ల హోండా యాక్టివా స్కూటర్స్ అమ్ముడయ్యాయి. ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీగా పెరుగుతున్న ఆధరణ దృష్ట్యా.. త్వరలోనే హోండా యాక్టివా స్కూటర్‌కి ఎలక్ట్రిక్ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.


3. అత్యధిక సంఖ్యలో అమ్ముడైన ద్విచక్ర వాహనాల జాబితాలో బజాజ్ పల్సర్ మూడో స్థానం సొంతం చేసుకుంది. బజాజ్ పల్సర్ బైక్స్ అమ్మకాల్లో 45.78 శాతం వృద్ధి నమోదైంది. ఫిబ్రవరి 2023లో 80,106 బజాజ్ పల్సర్ బైక్స్ అమ్ముడయ్యాయి. 


4. ఫిబ్రవరి 2023లో, హీరో కంపెనీకి చెందిన HF డీలక్స్ బైక్ 56,290 యూనిట్లు అమ్ముడయ్యింది. హీరో హెచ్ఎఫ్ డిలక్స్ బైక్స్ అమ్మకాల్లో 25.86 శాతం తగ్గుదల కనిపించింది. 2023 ఫిబ్రవరిలో అధికంగా అమ్ముడైన బైక్స్ జాబితాలో ఈ బైక్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, ఈ బైక్ ని కొనేవారికి కలిసొచ్చే అంశం ఏంటంటే.. కేవలం రూ.55 వేల నుంచే అందుబాటులో ఉండే ఈ బైక్ బేసిక్ వేరియంట్ మైలేజ్ పరంగా 65 కిమీ నుంచి 70 కిమీ వరకు ఇస్తుండటం కలిసొచ్చే అంశం. 


5. TVS జుపిటర్ స్కూటర్ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరిలో టీవీఎస్ జుపిటర్ స్కూటర్ అమ్మకాల్లో 14.44 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఫిబ్రవరి నెలలో 47,092 యూనిట్ల స్కూటర్స్‌ అమ్ముడవగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొత్తం 53,891 స్కూటర్స్ అమ్ముడయ్యాయి. 2023 ఫిబ్రవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 టూ వీలర్స్ సేల్స్ ట్రాక్ రికార్డ్ డీటేల్స్ ఇవి.


ఇది కూడా చదవండి : Best Selling Cars: మారుతి ఆల్టో, స్విఫ్ట్‌ను వెనక్కి నెట్టి అత్యధిక విక్రయాలు జరిపిన కారు, ధర కూడా తక్కువే


ఇది కూడా చదవండి : Discount up to Rs.90,000 on Nissan: రూ. 90 వేల వరకు భారీ డిస్కౌంట్.. నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ ఇప్పుడు కేవలం రూ.6 లక్షలే..!


ఇది కూడా చదవండి : TCS CEO Resigns: 22 ఏళ్ల అనుబంధానికి ముగింపు.. టీసీఎస్ సీఈఓ రాజీనామా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK