Best Selling Cars 2023: Alto, Swift వెనక్కి నెట్టి అత్యధిక విక్రయాలు జరిపిన Baleno.. ధర కూడా తక్కువే

Best Selling Cars 2023: బారతీయ కార్ మార్కెట్‌లో ఇంకా చౌక ధరకు లబించే హ్యాచ్ బ్యాక్ కార్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈనెల టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఎక్కువగా ఉన్నవి హ్యాచ్ బ్యాక్ కార్లే.  ఇందులో ఏ కార్‌ బెస్టో ఇప్పుడు తెలుసుకోండి...

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2023, 10:04 AM IST
Best Selling Cars 2023: Alto, Swift వెనక్కి నెట్టి అత్యధిక విక్రయాలు జరిపిన Baleno.. ధర కూడా తక్కువే

Best Selling Hatch back Cars in 2023: హ్యాచ్ బ్యాక్ కార్లలో నిన్న మొన్నటి వరకూ మారుతి సుజుకీ ఆల్టో, స్విఫ్ట్ మోడల్ రెండు కార్లు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఫిబ్రవరి నెల అమ్మకాలు పరిశీలిస్తే ఈ రెండు కార్లును మరో కారు వెనక్కి నెట్టేసింది. ఆల్టో, స్విఫ్ట్, వేగన్ ఆర్ వంటి కార్లను కాదని..టాప్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఈ కారు ధర కూడా కేవలం 6.5 లక్షలే.

1. మారుతి బలెనో

ఫిబ్రవరి 2023లో మారుతి సుజుకి బలెనో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. గత నెలలో ఈ కారు 18,592 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. అటు ఇదే నెల గత ఏడాది అంటే 2022 ఫిబ్రవరిలో 12,570 యూనిట్లు విక్రయాలు జరిగాయి. అంటే విక్రయాలు ఏడాదికి 47.91 శాతం పెరిగాయి. మారుతి బలేనో ధర 6.56 లక్షల నుంచి ప్రారంభమై 9.83 లక్షల వరకూ ఉంది.

2. మారుతి స్విఫ్ట్

ఇక రెండవ స్థానంలో ఉంది మారుతి స్విఫ్ట్. ఈ కారు ఫిబ్రవరి 2023లో 18,412 యూనిట్ల అమ్మకాలు జరిపింది. అదే గత ఏడాది అంటే 2022 ఫిబ్రవరిలో 19,202 యూనిట్ల అమ్మకాలు చేసింది. అంటే విక్రయాలు ఈ ఏడాది 4.11 శాతం క్షీణించాయి.

3. మారుతి ఆల్టో

మూడవ స్థానంలో నిలిచింది మారుతి ఆల్టో. ఫిబ్రవరి 2023లో మారుతి ఆల్టో 18.114 యూనిట్ల అమ్మకాలు జరిపితే, గత ఏడాది ఫిబ్రవరిలో 11,551 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అంటే ఈ ఏడాది ఏకంగా 56.82 శాతం విక్రయాలు పెరిగాయి. మారుతి ఆల్టో ధర 3.54 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. ఇందులో ఆల్టో 800, ఆల్టో కే10 రండు మోడల్స్ ఉన్నాయి.

టాప్ 10 కార్ల విక్రయాలు

1. మారుతి బలేనో                  18,592 యూనిట్లు
2. మారుతి స్విఫ్ట్                    18,412 యూనిట్లు
3. మారుతి ఆల్టో                     18,114 యూనిట్లు
4. మారుతి వేగన్ ఆర్             16,889 యూనిట్లు
5. మారుతి డిజైర్                    16,798 యూనిట్లు
6. మారుతి బ్రెజా                    15,787 యూనిట్లు
7. టాటా నెక్సాన్                     13,914 యూనిట్లు
8. మారుతి సుజుకి ఈకో           11,352 యూనిట్లు
9. టాటా పంచ్                       11,169 యూనిట్లు
10. హ్యుండయ్ క్రెటా             10,421 యూనిట్లు

Also Read: Post Office Schemes: పోస్టాఫీసు కస్టమర్లకు గుడ్‌న్యూస్, ఈ పధకంలో 50 లక్షలు సంపాదించే అవకాశం

Also Read: Taraka Ratna Wife Emotional: నువ్ రియల్ హీరో ఓబు.. ఆ గుండె అన్నీ భరించింది.. తారకరత్న వైఫ్ అమోశానల్ పోస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News