First Time Home Buyer Mistakes: ప్రతి ఒక్కరికి సొంతిల్లు నిర్మించుకోవడం ఓ కల. చిన్నదో.. పెద్దదో తమకంటూ ఓ సొంతిల్లు ఉండాలని రేయింబవళ్లు కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటారు. నగరాల్లో స్థలాల రేట్లు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్లు కొనేందుకు ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు. కొంతవరకు డౌన్ పేమెంట్ చెల్లించి.. మిగిలిన డబ్బులకు లోన్‌ల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఇల్లు కొనుక్కోవడం మంచి విషయమే అయినా.. చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కురుకుపోయే అవకాశం ఉంటుంది. మీరు ఇల్లుకొనే సమయంలో ఈ ఐదు తప్పులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్థిక పరిస్థితి..


ఇల్లు కొనేముందు మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోండి. ఆర్థికంగా మీ జీవితంలో ఇది పెద్ద నిర్ణయం. భావోద్వేగంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముందు మీ వద్ద ఉన్న డబ్బులను.. మొత్తం అయ్యే ఖర్చును అంచనా వేసి ఇల్లు కొనేందుకు అడుగులు వేయండి. 


ఏరియా డిమాండ్..


ఇల్లు కొనేముందు ఏరియా డిమాండ్‌ను కచ్చితగా చెక్ చేసుకోవాలి. ఎలాంటి వసతులులేని ఏరియాలో ఇల్లు కొంటే.. నష్టపోయే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో వచ్చే సౌకర్యాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజా రవాణా వ్యవస్థ, స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని దగ్గరలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. తక్కువ నివాసం ఉంటే.. ప్రజా రవాణా వ్యవస్థ లేకుడా.. పాఠశాలలు, హాస్పిటల్స్ వంటి సౌకర్యాలు లేని చోట ఇల్లు కొనకండి.  అక్కడ మీరు ఇల్లు కొన్నా.. రవాణాకు ఇబ్బందులు పడొచ్చు. ప్రాపర్టీ వ్యాల్యూ కూడా పెద్దగా పెరగదు. అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నచోట ఇల్లు కొనుగోలు చేయండి. 
 
లోన్ గురించి..


మీ ఇల్లు బడ్జెట్‌లో 10 నుంచి 20 శాతం వరకు డౌన్ పేమెంట్ చెల్లించేలా చూసుకోండి. అది కూడా మీ సేవింగ్స్ అయి ఉండాలి. మిగిలిన డబ్బుకు బ్యాంకు లోన్‌కు వెళ్లండి. హోమ్‌ లోన్ కోసం బ్యాంకులలో ముందుగానే ఎంక్వరీ చేయండి. బ్యాంకులు మీ లోన్ రీపేమెంట్ కెపాసిటీని అంచనా వేసి.. ఎంత లోన్ వస్తుందో ముందుగానే చెబుతాయి.  నాలుగైదు బ్యాంకులలో వడ్డీ రేటును చెక్ చేసుకున్న తరువాతే ముందుకు వెళ్లండి. 


ఈ ఖర్చులపై దృష్టిపెట్టండి


ఇల్లు కొనే సమయంలో అనేక ఇతర ఖర్చులు వస్తాయి. రిజిస్ట్రేషన్‌తోపాటు ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి. వీటన్నింటి గురించి ముందుగానే తెలుసుకోండి. ఈ ఖర్చులకు మీరు సొంతంగా డబ్బును సిద్ధం చేసుకుంటే మంచింది. డౌన్‌ పేమెంట్ కోసం, రిజిస్ట్రేషన్ ఛార్జీల కోసం లోన్‌లు తీసుకోవద్దు. మీరు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. ముందుగా మీ వద్ద ఎక్కువ మొత్తం డబ్బును పొదుపు చేసుకున్న తరువాత.. ఇల్లు ప్రయత్నాలు మొదలు పెట్టండి.


గుడ్డిగా నమ్మద్దు..


మీరు బ్రోకర్ ద్వారా వెళ్లినా.. బిల్డర్ లేదా ప్రాపర్టీ డీలర్‌ని గుడ్డిగా నమ్మవద్దు. బ్రోకర్ తన కమీషన్ కోసం మిమ్మల్ని నిండా ముంచే ప్రమాదం ఉంటుంది. మీరు సొంతంగా వెళ్లి అన్ని విషయాలను తెలుసుకోండి. ఎలాంటి లిటికేషన్స్ లేవని నిర్ధారించుకోండి. ముఖ్యంగా న్యాయపరమైన ఇబ్బందుల గురించి ఆరా తీసుకోండి. గుడ్డిగా ముందుగా డౌన్‌ పేమెంట్ చెల్లించి మోసపోవద్దు. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు.


Also Read: Ind Vs IRE 1st T20: నేడే బుమ్రా రీఎంట్రీ.. ఐర్లాండ్‌తో తొలి టీ20.. కుర్రాళ్లు కుమ్మేస్తారా..?  


Also Read: Cement Block on Railway Track: తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఒడిషా తరహా రైలు ప్రమాదానికి భారీ కుట్ర ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి