EPF Withdrawal Rules: ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన తరువాత బ్యాంకులు ఇటీవల హోమ్ లోన్ల వడ్డీ రేట్లను పెంచాయి. చాలా బ్యాంకులు ఇప్పటికే ఉన్న.. కొత్త లోన్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. దీంతో చాలామంది తమ హోమ్ లోన్ త్వరగా క్లియర్ చేసేందుకు చూస్తున్నారు. ఇందుకోసం డబ్బు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. కొందరు వారు తమ ఈపీఎఫ్‌ మొత్తాన్ని వాడుకుని హోమ్ లోన్‌ను క్లియర్ చేయాలని చూస్తున్నారు. మరీ ఈపీఎఫ్ నుంచి మొత్తం నగదు ఒకేసారి డబ్బును విత్‌డ్రా చేయవచ్చా..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈపీఎఫ్ పథకంలోని సెక్షన్ 68 బీబీ ప్రకారం.. మీరు మీ హోమ్ లోన్ రీపేమెంట్ కోసం ఈపీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇంటిని వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా పీఎఫ్ సభ్యుడి పేరు మీద నమోదు చేయాలి. హోమ్ లోన్ దరఖాస్తుదారు కనీసం పదేళ్ల పీఎఫ్ కంట్రిబ్యూషన్ రికార్డును కలిగి ఉండాలి. ఐదేళ్ల నిరంతర సర్వీస్ పూర్తయిన తర్వాత విత్‌డ్రా చేసుకునే పీఎఫ్ మొత్తంపై ఎలాంటి ట్యాక్స్‌ ఉండదు. 


నగదు విత్ డ్రా చేసుకునే ముందు మీరు అన్ని అంశాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మీ కెరీర్ ప్రారంభ దశలో ఉన్నట్లయితే.. మీ ఈపీఎఫ్ ఖాతాకు నిధులు సమకూర్చడానికి మీకు ఎక్కువ కాలం ఉన్నందున.. మీరు హోమ్ లోన్ తిరిగి చెల్లించడానికి పీఎఫ్‌ కార్పస్‌ని ఉపయోగించవచ్చు. హోమ్‌ లోన్ వడ్డీ ఈపీఎఫ్ వడ్డీ కంటే ఎక్కువగా ఉంటే.. ఈపీఎఫ్ కార్పస్‌ని ఉపయోగించవచ్చు. ఈపీఎఫ్‌పై వడ్డీ గృహ రుణ వడ్డీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. ఈపీఎఫ్ నుంచి నగదు తీసుకోకపోవడమే మంచింది.


పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడాన్ని చివరి ఆప్షన్‌గా ఎంచుకోవాలి. మీరు తాత్కాలిక ఆర్థిక పరిస్థితిలో ఉండి.. సమీప భవిష్యత్తులో దాని నుంచి బయటపడాలని ఆశించినట్లయితే మీరు పీఎఫ్ కార్పస్‌ను యాక్సెస్ చేయవచ్చు. కానీ మీ ఆర్థిక సమస్య ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియకుంటే.. మీరు ముందుగా ఈఎమ్‌ఐని తగ్గించడానికి లోన్ కాలపరిమితిని పెంచడం లేదా తిరిగి చెల్లింపును నిర్వహించడానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఉపయోగించడం వంటి ఇతర ఆప్షన్లు ఎంచుకోవచ్చు. పీఎఫ్ మొత్తం మీ రిటైర్‌మెంట్ ప్లాన్ కోసం కేటాయించింది. మీరు ఆ డబ్బును ఆ సమయానికి సురక్షితంగా ఉంచుకోవాలి. హోమ్ లోన్ కోసం ఉపయోగించకుంటే రిటైర్‌మెంట్ తరువాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది.


Also Read: Ind Vs SL: సిరీస్‌ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..!  


Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 


Pakistan Economic Crisis