Home loan Transfer Tips: హోమ్ లోన్ బదిలీ చేసుకునే ఆప్షన్ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నచ్చిన బ్యాంకుకు హోమ్ లోన్ ఎప్పుడైనా బదిలీ చేసుకోవచ్చు. కానీ అందుకు కొన్ని డాక్యుమెంట్లు అవసరమౌతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మీ అర్హతను బట్టి వేరే బ్యాంకు హోమ్ లోన్ బదిలీకు అంగీకరించడం లేదా తిరస్కరించడం ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణం బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు ఏ బ్యాంకు సులభంగా, త్వరగా ఇస్తుందో పరిశీలిస్తారు. ఈ క్రమంలో బ్యాంకులు అత్యధిక వడ్డీ వసూలు చేస్తుంటాయి. లేదా పూర్తిగా లోన్ తీసుకున్న తరువాత వడ్డీ రేటు పెరిగిపోవచ్చు. ఇతర బ్యాంకుల వడ్డీ తక్కువగా ఉండవచ్చు. వడ్డీ రేటు అధికంగా ఉంటే మరో బ్యాంకుకు హోమ్ లోన్ బదిలీ చేయడం ఉత్తమ మార్గం. తద్వారా వడ్డీ రేటు తగ్గించుకోవచ్చు. హోమ్ లోన్ బదిలీ చేసేముందు ప్రస్తుత బ్యాంకును సంప్రదించి వడ్డీ రేటు తగ్గించే విషయం చర్చిస్తే మంచిది. మీ క్రెడిట్ హిస్టరీ బాగుండి, వాయిదాలు సకాలంలో చెల్లిస్తుంటే వడ్డీ రేటు తగ్గించే అవకాశం లేకపోలేదు. 


హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు బదిలీ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ప్రోసెసింగ్ పీజు, అప్లికేషన్ ఫీజు, అడ్మినిస్ట్రేషన్ ఫీజు, రివ్యూ ఫీజు చెల్లించాలి. ఈ రకమైన ఫీజులు రెండు బ్యాంకులు వసూలు చేస్తాయి. వేరే బ్యాంకు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడే హోమ్ లోన్ బదిలీ ఎంచుకోవాలి. మీ లోన్ టెన్యూర్ ముగియవస్తున్నా లేక ప్రోపర్ఠీ అమ్మేసే ఉద్దేశ్యమున్నా హోమ్ లోన్ బదిలీ ఆలోచన మంచిది కాదు.


హోమ్ లోన్ బదిలీ చేసే ముందు వడ్డీ రేట్లు, నిబంధనల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొత్త హోమ్ లోన్ అప్లై చేసేందుకు అర్హత వివరాలు చెక్ చేసుకోవాలి. ఇన్‌కం ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ వంటి వివరాలు సమర్పించాలి. పాత లోన్ క్లోజ్ చేసి కొత్త లోన్ ప్రారంభించాలి. 


Also read: Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook