Car Festival Offers: కారు కొనే ఆలోచన ఉందా..అక్టోబర్ 31 వరకే అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు
Car Festival Offers: పండుగ సీజన్ నడుస్తోంది. కారు కొనుగోలుకు ఆలోచిస్తుంటే..ఇది మీకు గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల కంపెనీలు ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకుని డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
ఇటీవలి కాలంలో కారు అనేది ఓ అవసరంగా మారుతోంది. అందుకే కొత్త కొత్త కార్లు మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ల కంపెనీలు పండుగల వేళ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగమే ఇప్పుడు దీపావళి ఆఫర్లు. అవేంటో తెలుసుకుందాం..
పండుగల వేళ కార్ల కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తుంటాయి. ప్రతియేటా అక్టోబర్ నెలలో ఈ ఆపర్లు ఎక్కువగా ఉంటాయి. కారణం అక్టోబర్ నెలనేది ఫెస్టివల్ సీజన్, దసరా, దీపావళి పండుగలుంటాయి. ఇప్పటికే హోండా, హ్యుందయ్ కంపెనీలు తమ కార్లపై భారీగా ఆఫర్లు ప్రకటించాయి. హోండా కంపెనీ 39,298 రూపాయల డిస్కౌంట్ ప్రకటించగా, హ్యుందయ్ కంపెనీ లక్ష రూపాయలవరకూ ఆఫర్ ఇచ్చింది.
ఇప్పుడు తాజాగా ఫ్రెంచ్ కార్ల కంపెనీ రీనాల్ట్ కూడా క్విడ్, ట్రైబర్, కైగర్ వాహనాలపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ పేరుతో ఏకంగా 50 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లు కేవలం అక్టోబర్ 31 వరకే ఉంటాయి. రీనాల్ట్ కైగర్ మోడల్ పై మాత్రం క్యాష్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ లేదు. దీనిపై కేవలం 10 వేల రూపాయలే బెనిఫిట్స్ ఉన్నాయి.
రీనాల్ట్ ట్రైబర్ కారుపై 50 వేల వరకూ లబ్ది పొందవచ్చు. ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి. 15 వేలు క్యాష్ డిస్కౌంట్, 25 వేలు ఎక్స్చేంజ్ బోనస్, 10 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. రీనాల్ట్ ట్రైబర్ అనేది ఇండియాలో లభిస్తున్న ఏకైక సబ్ 4 మీటర్ ఎంపీవీ. ఇక మల్టీ పర్పస్ వెహికల్ లిమిటెడ్ ఎడిషన్ పై 10 వేలు క్యాష్ డిస్కౌంట్, 25 వేలు ఎక్స్చేంజ్ బోనస్, 10 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.
ఇక రీనాల్ట్ క్విడ్ మోడల్ 2019లో లాంచ్ అయింది. దీనిపై 35 వేల వరకూ డిస్కౌంట్ ఉంది. ఇది ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ కారు. మారుతి సుజుకి ఆల్టోతో పోటీ పడుతోంది.
Also read: EPF Interest Credit: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, త్వరలోనే పీఎఫ్ వడ్డీ డబ్బులు మీ ఖాతాల్లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook