Honda Sp 160 New Model 2024: ఎప్పటి నుంచి ఎక్కువ మైలేజీనిచ్చే మంచి బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ మోటర్‌ సైకిల్‌ కంపెనీ హోండా ఇటీవలే ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. ఇది హోండా SP160 పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇది ఇంతక ముందు ఉన్న మోటర్‌ సైకిల్స్‌లా కాకుండా ప్రీమియం డిజైన్‌తో కంపెనీ లాంచ్‌ చేసింది. ఇది ఎంతో శక్తివంతమైన 162 cc ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ బైక్‌ లీటర్‌ పెట్రోల్‌కి దాదాపు 62 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీంతో పాటు ఈ మోటర్‌ సైకిల్ ప్రీమియం డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ హోండా SP160 బైక్‌కి సంబంధించిన ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శక్తివంతమైన ఇంజన్, మైలేజీ:
హోండా SP160 మోటర్‌ సైకిల్‌ 162.71 cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఇది 13.27 PS శక్తితో పాటు 14.58 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మోటర్‌ సైకిల్‌ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇంజన్‌ వంటి అద్భుతమైన శక్తి, సామార్థ్యాలనకు కలిగి ఉంటుంది. దీంతో పాటు కంపెనీ అందించిన వివరాల ప్రకారం, ఈ మోటర్‌ సైకిల్ దాదాపు  62 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ముఖ్యంగా ఈ బైక్‌తో సిటీల్లో తిరిగేవారికి దాదాపు 55 కిలో మీటర్ల వరకు మైలేజీనిస్తుంది. 


అద్భుతమైన డిజైన్‌:
హోండా SP160 మోటర్‌ సైకిల్‌ ప్రీమియం లుక్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 2061 మిమీ ఉండగా..వీల్ బేస్ 1347 మిమీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు వెడల్పు 786 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 177 మిమీ ఉంటుంది. దీంతో మీరు అద్భుమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. ఇక ఈ హోండా SP160 మోటర్‌ సైకిల్ బ్రేక్స్‌ విషయానికొస్తే, దీని ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ ఉంటుంది. అలాగే వెనక చక్రానికి డ్రమ్ బ్రేక్ సెటప్‌ను కంపెనీ అందించింది. ఇక ఈ మోటర్‌ సైకిల్ ధర విషయానికొస్తే, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,20,000తో లభించనుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
డిజిటల్ స్పీడోమీటర్
డిజిటల్ ఓడోమీటర్
డిజిటల్ ఫ్యూయల్ గేజ్
ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్
గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు
చైన్ డ్రైవ్ అల్లాయ్ వీల్ సిస్టమ్‌ 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి