Honey Business: తక్కువ ఖర్చు..ఎక్కువ లాభం, తేనె ప్రాసెసింగ్ యూనిట్ ఎలా పెట్టాలి
Honey Business: కాస్త శ్రమ, తెలివితేటలు, పెట్టుబడి ఉంటే చేసుకోవాలే కానీ చాలా వ్యాపార ఆలోచనలుంటాయి. మీరు కూడా సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటుంటే..ఇది మంచి ఆలోచన.
Honey Business: కాస్త శ్రమ, తెలివితేటలు, పెట్టుబడి ఉంటే చేసుకోవాలే కానీ చాలా వ్యాపార ఆలోచనలుంటాయి. మీరు కూడా సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటుంటే..ఇది మంచి ఆలోచన.
ఉద్యోగం మంచిదా, వ్యాపారం మంచిదా అంటే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అభిప్రాయం. కష్టపడి పనిచేస్తే వ్యాపారానికి మించింది లేదని కూడా అంటారు. అయితే పెట్టే వ్యాపారం సరైంది అయుండాలి. తేనెటీగల పెంపకం లాభదాయకమైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం కూడా అందిస్తుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తుంటాయి.
ప్రభుత్వం నుంచి సబ్సిడీ
దేశంలో తేనెటీగల పెంపకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పాదకతను పెంచడం, శిక్షణ, అవగాహన కల్పించడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇందులో భాగంగానే తేనెటీగల పెంపకం అభివృద్ధి పేరుతో ఓ పధకాన్ని ప్రారంభించింది. నేషనల్ బీ బోర్డ్ , నాబార్డ్ స్వయంగా కలిసి ఈ పథకాన్ని ప్రారంభించాయి. ప్రభుత్వం నుంచి ఏకంగా 80-95 శాతం సబ్సిడీ అందుతుంది.
మీ పెట్టుబడి, వ్యాపారం ప్రారంభించేందుకు మీకు అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి వ్యాపారం ఏ స్థాయిలో ప్రారంభించాలో నిర్ణయించవచ్చు. పది పెట్టెలతో కూడా ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. పది పెట్టెలతో దాదాపు 40 కిలోల తేనె చొప్పున 4 వందల కిలోల తేనె లభిస్తుంది. కిలో తేనెను మార్కెట్‌లో 350 రూపాయలకు విక్రయిస్తే..1.40 లక్షల రూపాయలు ఆదాయం లభిస్తుంది. ఒక్కొక్క పెట్టెకు 3 వేల 5 వందల ఖర్చు అంటే మొత్తం మీద 35 వేలు ఖర్చవుతుంది. వచ్చే ఆదాయం 1.40 లక్షల నుంచి 35 వేలు మినహాయిస్తే..నికర లాభం 1 లక్షా 5 వేలుంటుంది.
అయితే ముందు మార్కెటింగ్ వెసులుబాటు చూసుకుని ఈ వ్యాపారంలో దిగితే మంచిది. మార్కెట్ పరంగా తేనెకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎవరు ఏ రేటులో కొనుగోలు చేస్తున్నారు, ఏ రేటుకు విక్రయిస్తున్నారనేది కాస్త పరిశీలించాల్సి ఉంటుంది.
Also read: నష్టాల బాటలో క్రిప్టో కరెన్సీ ... భారీగా నష్టపోతున్న పెట్టుబడిదారులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook