Stock Market today: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ 814 పాయింట్లు పెరిగి 58,014 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 238 పాయింట్ల లాభంతో 17,410 వద్ద స్థిరపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాభాలకు కారణాలు..


2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రేపు (ఫిబ్రవరి 1) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. కరోనా సంక్షోభం నేపథ్యంలో వస్తున్న బడ్జెట్ కావడంతో ఈ సారి బడ్జెట్​పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశ వృద్ధికి ఊతమందించే దిశగా ప్రకటనలు ఉండొచ్చని తెలుస్తోంది. పరిశ్రమలు, ఆర్థిక సంస్థలను ప్రోత్సహించే విధంగా కూడా బడ్జెట్​లో కేటాయింపులు ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలన్నంటి నేపథ్యంలో మదుపరులు నేడు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీనితో సూచనీలు నేడు రికార్డు స్థాయిలో లాభాలను గడించాయని విశ్లేషకులు చెబుతున్నారు.


నేటి సెషన్​లో అన్ని రంగాలు భారీగా లాభాలను గడించాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు భారీగా పుంజుకున్నాయి.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో సెన్సెక్స్​ 58,257 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. ఒకానొక దశలో 57,746 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ ఇంట్రాడేలో 17,410 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,264 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 23 కంపెనీలు లాభాలను గడించాయి. మూడు సంస్థలు మాత్రమే నష్టపోయాయి.


టెక్​ మహీంద్రా 4.88 శాతం, విప్రో 3.70 శాతం, బజాజ్ ఫినాన్స్​ 3.22 శాతం, ఇన్ఫోసిస్​ 3.05 శాతం, ఎస్​బీఐ 2.87 శాతం లాభాలను గడగించాయి.


ఇండస్​ఇండ్​ బ్యాంక్​ 3.51 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్​ 2.14 శాతం, హెచ్​యూఎల్​ 0.38 శాతం చొప్పున నష్టాలను నమోదు చేశాయి.


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా), థైవాన్​ సూచీలు సెలవులో ఉన్నాయి.


రూపాయి విలువ..


డాలర్​తో పోలిస్తే రూపాయి 43 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.60 వద్ద కొనసాగుతోంది.


Also read: Flipkart Electronics Sale 2022: రూ.4,500లకే శాంసంగ్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ- ఈరోజే తుదిగడువు!


Also read: Lenovo Legion Y90 : వావ్!! ప్రపంచంలోనే మొట్టమొదటి 22GB RAM స్మార్ట్ ఫోన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook