Home Loan Interest Rates: దేశంలోని టాప్ 9 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఏ బ్యాంకులో ఎంత
Home Loan Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మోనిటరీ పాలసీ ప్రకారం వడ్డీ రేట్లు మారనున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్‌పై ఇవి అధిక ప్రభావం చూపించనున్నాయి. ఇవి నెలవారీ ఇఎంఐలపై కీలక ప్రభావం చూపిస్తాయి. అందుకే హోమ్ లోన్ తీసుకునేముందు ఏ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం.
Home Loan Interest Rates: ఆర్బీఐ గత 18 నెలలుగా రెపో రేటు మార్చకుండా యధాతధంగా ఉంచింది. గత వారం కొత్త పాలసీ ప్రకటించడంతో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను సమీక్షించనున్నాయి. కొత్త వడ్డీ రేట్లను ప్రకటిస్తాయి. ముఖ్యంగా హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు మారవచ్చు. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ ఎంత ఉందో తెలుసుకుందాం.
దసరా, దీపావళి పురస్కరించుకుని కొత్తగా ఇళ్లు కొనుగోలు చేసే ఆలోచన ఉంటే ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అనేది తెలుసుకోవాలి. 75 లక్షల లోన్ తీసుకుంటే 20 ఏళ్ల కాల పరిమితి అయితే ఇఎంఐ ఎంత ఉంటుందో ప్లాన్ చేసుకోవడం అవసరం. ఇఎంఐ ఎంత ఉంటుందనేది ఆ బ్యాంకు వసూలు చేసే వడ్డీని బట్టి మారుతుంటుంది. హోమ్ లోన్ వడ్డీ అనేది బ్యాంకుని బట్టి, సిబిల్ స్కోరును బట్టి మారుతుంటుంది. అందరికీ ఒకే విధమైన వడ్డీ ఉండకపోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అతిపెద్ద బ్యాంక్. ఈ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ కాస్త ఎక్కువే. 9.15 శాతం వసూలు చేస్తోంది. ఈ బ్యాంకు నుంచి హోమ్ లోన్ 75 లక్షలు 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకుంటే నెలకు ఈఎంఐ 67,725 రూపాయలు అవుతుంది.
కెనరా బ్యాంకు
కెనరా బ్యాంకుతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ వడ్డీ రేటు ఒకేలా ఉంది. ఈ రెండు బ్యాంకులు 8.5 శాతం వడ్డీ ఛార్జ్ చేస్తున్నాయి. 75 లక్షల హోమ్ లోన్ 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకుంటే నెలకు ఈఎంఐ 64,650 రూపాయలు అవుతుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం హోమ్ లోన్‌పై అతి తక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంకు హోమ్ లోన్లపై 8.35 శాతం వడ్డీ ఛార్జ్ చేస్తోంది. అంటే 75 లక్షల రుణం 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకుంటే నెలకు ఈఎంఐ 63,900 రూపాయలు.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు హోమ్ లోన్ 8.35 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. 75 లక్షల హోమ్ లోన్ 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకుంటే నెలకు ఈఎంఐ 63,900 రూపాయలు అవుతుంది.
కోటక్ మహీంద్ర బ్యాంక్
కోటక్ మహీంద్ర బ్యాంక్ హోల్ లోన్‌పై 8.7 శాతం వడ్డీ అందుతుంది. 75 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే 20 ఏళ్ల కాల పరిమితికి నెలకు ఈఎంఐ 64,550 రూపాయలు అవుతుంది.
యాక్సిస్ బ్యాంక్
ప్రైవేట్ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంకు 8.75 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. 75 లక్షల రుణాన్ని 20 ఏళ్ల కాల పరిమితిపై నెలకు ఈఎంఐ 65,775 రూపాయలు అవుతుంది.
ఐసీఐసీఐ బ్యాంక్
ఈ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ 9 శాతం ఉంది. ఇందులో 75 లక్షలు రుణం తీసుకుంటే 20 ఏళ్ల కాల పరిమితికి నెలకు ఈఎంఐ 66,975 రూపాయలు అవుతుంది
ఎస్ బ్యాంక్
దేశంలో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఇది. 9.4 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. 75 లక్షల హోమ్ లోన్ 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకుంటే నెలకు ఈఎంఐ 68,850 రూపాయలు అవుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
ఈ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ 9.4 శాతం ఉంది. 75 లక్షల హోమ్ లోన్ 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకుంటే నెలకు ఈఎంఐ 68,850 రూపాయలు అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.