How to get duplicate PAN card: ఆర్థికపరమైన లావాదేవాలకు కీలకమైన డాక్యుమెంట్​ పాన్. PAN అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్​.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్​ కార్డ్ (PAN card Uses) పోగొట్టుకుంటే.. పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలు చాలా వరకు నిలిచిపోతాయి. ఐటీ రిటర్నులు కూడా దాఖలకు చేయలేరు. వీటితో పాటు మరెన్నో ఇబ్బందులు వస్తాయి.


అయితే పాన్​ కార్డ్ పొగొట్టుకుంటే.. ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రస్తుత డిజిటల్​ యుగంలో ఇలాంటి సమస్యలకు సులభతరమైన పరిష్కారం ఉంది. కొన్ని సులభమైన స్టెప్స్​ ఫాలో అవ్వడం ద్వారా ఇంటి  వద్ద నుంచే పాత నంబర్​తో.. కొత్త పాన్​ కార్డ్​ను తిరిగి (How to Get new PAN card on Old Number) పొందొచ్చు.


పాన్​ కార్డ్​ రికవరీకి  అందుబాటులో ఉన్న రెండు సులభమైన పద్దతులను ఇప్పుడు చూద్దాం.


పాన్​ కార్డ్ డూప్లికేట్ కోసం మొదటి సదుపాయం..


  • ముందుగా https://www.tin-nsdl.com లోకి లాగిన్​ అవ్వాలి

  • హోం పేజీలో కనిపించే 'ఆన్​లైన్​ పాన్​ సర్వీసెస్'​ అనే ఆప్షన్​పై క్లిక్​ చేయండి

  • ఇందులో ఒక డ్రాప్ బాక్స్​ ఓపెన్​ అవుతుంది

  • డ్రాప్​ బాక్స్​లో 'అప్లయ్​ ఫర్ పాన్'​ ఆన్​లైన్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి

  • ఇక్కడ రీ ప్రింట్​ ఆఫ్ పాన్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి

  • ఓ అప్లికేషన్​ ఫారం ఓపెన్​ అవుతుంది

  • ఈ ఫారమ్​లోలో మీకు సంబంధించిన వివరాలన్నింటిని నింపాల్సి ఉంటుంది 

  • వివరాలను నింపిన తర్వాత.. ఓటీపీ ఆప్షన్​ను ఎంచుకోవాలి

  • మీ మొబైల్​ నంబర్​కు లేదా మీ ఈ-మెయిల్​కు వచ్చే ఓటీపీని ఎంటర్​ చేసీ వెరిఫై పై క్లిక్ చేయాలి

  • ఆ తర్వాత సాధారణ ఛార్జీ అయిన రూ.50 చెల్లించాల్సి ఉంటుంది

  • ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే మీ మొబైల్ నంబర్​కు ఓ మెసేజ్​ వస్తుంది. ఇందులో ఉండే లింక్​ ద్వారా మీరు ఈ-పాన్​ను కూడా డౌన్​లోడ్ చేసుకోవచ్చు

  • మెసేజ్ వచ్చిందంటే అప్లికేషన్ పూర్తయినట్లు అర్థం చేసుకోవాలి

  • ఆ తర్వాత పర్మనెంట్ అడ్రస్​కు పోస్ట్​ ద్వారా పాత నంబర్​తో కొత్త పాన్​ కార్డ్ వస్తుంది


రెండో సదుపాయం ఇలా..


  • ఇన్​కం ట్యాక్స్ పాన్ వెబ్​ సైట్​ https://www.pan.utiitsl.com/PAN/reprint.html లోకి లాగిన్ అవ్వాలి

  • హోం పేజీలోనే 'రీప్రింట్ ఆఫ్​ పాన్​ కార్డ్' ఆప్షన్​ను ఎంచుకోవాలి

  • ఇప్పటికే పాన్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే ఈ సదుపాయం ఉపయోగపడుతుంది

  • రీ ప్రింట్ ఆప్షన్​పై క్లిక్​ చేస్తే.. ఓ అప్లికేషన్​ ఫారం ఓపెన్​ అవుతుంది

  • ఫారంలో అడిగిన అన్ని వివరాలను నింపాలి (పోగొట్టుకున్న కార్టులో ఉన్న విధంగానే వివరాలను నింపాలి.)

  • ఆ తర్వాత రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. నెట్​ బ్యాంకింగ్​, యూపీఐ, లేదా కార్డ్స్​ ద్వారా పేమెంట్ చేయొచ్చు

  • పాన్​కు జత చేసిన అడ్రస్​కు పోస్ట్​ ద్వారా.. కొత్త కార్డ్ వస్తుంది. వారం రోజుల వరకు ఇందుకు సమయం పట్టొచ్చు


Also read: Budget 2022: త్వరలో తగ్గనున్న స్మార్ట్​ఫోన్స్​, ఇతర ఎలక్ట్రానిక్స్ ధరలు?


Also read: Redmi note 11 pro 5g: రెడ్‌మి నోట్ 11 ప్రో 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook