Royal Enfield Dealership Registration: రాయల్ ఎన్‌ఫీల్డ్.. బైక్ రైడింగ్ ఇష్టపడే వారికి, బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ వెళ్లాలనుకునే వారికి ఇష్టమైన బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్. కొంతమందికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఓ ఇష్టమైతే.. ఇంకొంత మందికి అవి స్టేటస్ సింబల్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ మెయింటెన్ చేయడం అంటేనే రాయల్‌గా ఉండటమే అనుకునే వారి సంఖ్యకు కూడా కొదువే లేదు. అందుకే రాయల్ ఎన్‌‌ఫీల్డ్ బైక్స్‌కి మార్కెట్లో ఉన్న క్రేజే వేరు. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన మోడల్స్ తీసుకొస్తూ మిగతా బైక్ బ్రాండ్స్‌తో పోటీపడేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే డీలర్‌షిప్స్ పెంచుకోవడం ద్వారా తమ బైక్స్ సేల్స్ మరింత పెంచుకోవాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ భావిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బైక్స్ సేల్స్ పెంచుకునే ప్రయత్నంలోనే భాగంగా తాజాగా జనరల్ పబ్లిక్ నుంచి డీలర్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాయల్ ఎన్‌‌ఫీల్డ్ ప్రకటించింది. రాయల్ ఎన్‌‌ఫీల్డ్ బ్రాండ్ విశిష్టతలు, డీలర్స్‌తో, డిస్ట్రిబ్యూటర్స్‌తో, కస్టమర్స్ ఇతర బిజినెస్ పార్ట్‌నర్స్‌తో తమ సంస్థకు ఉన్న అనుబంధం గురించి, వారికి ఇచ్చే ప్రాధాన్యతల గురించి కంపెనీ ఈ ప్రకటనలో వివరించింది. రాయల్ ఎన్‌‌ఫీల్డ్ డీలర్‌షిప్ తీసుకోవాలనుకునే వారికి ఒక రకంగా ఇదొక గుడ్ ఆపర్చునిటీ అంటున్నారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి, ఆటోమొబైల్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వారు. 


రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?


రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్ కోసం వారి అధికారిక వెబ్‌సైట్ అడ్రస్ https://www.royalenfield.com/in/en/forms/become-a-dealer/ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. లేదా రాయల్ ఎన్‌ఫీల్డ్ టోల్ ఫ్రీ నెంబర్ 8291 90 8291 కి 7 రోజుల్లోగా ఫోన్ చేసి తమ వివరాలు తెలియచేయవచ్చు. 
   
రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌కి దరఖాస్తు చేసుకునే వారి కోసం స్టెప్ బై స్టెప్ గైడ్ వివరాలు ఇలా ఉన్నాయి.


పేరు :
డీలర్‌షిప్ తీసుకోవాలనుకునే సిటీ వివరాలు :
ఈమెయిల్ ఐడి  :
పిన్‌కోడ్ :
మొబైల్ నెంబర్ :
మీ వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఉందా :
ఉంటే యస్ అని లేకుంటే నో అని తెలుపగలరు :
వయస్సు :
మీ వద్ద మోటార్ సైకిల్  :
విద్యార్హతల వివరాలు :
కంపెనీ పేరు :
సోర్స్ వివరాలు :
డిస్క్రిప్షన్ వివరాలు :
అడ్రస్ :
నియమ నిబంధనలు, షరతులు, ప్రైవసీ పాలసీకి అంగీకరిస్తున్నట్టుగా ఆ బటన్‌పై నొక్కండి.
అన్ని వివరాలు పొందుపర్చిన తర్వాత చివరన ఉన్న సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.


Also Read : EPF Money Interesting Facts: ఈపీఎఫ్ ఫండ్‌ని బ్యాంకులు, కోర్టులు అప్పుల కింద అటాచ్ చేయొచ్చా? చట్టం ఏం చెబుతోంది?


Also Read : New Cash Withdrawal Rules: ఏటీఎం కొత్త క్యాష్ విత్‌డ్రాయల్ నిబంధనలు త్వరలో, ఓటీపీ తప్పనిసరి


Also Read : Domino vs Swiggy - Zomato, Zomato Share Price : డొమినో పిజ్జా ఇకపై స్విగ్గీ-జొమాటోల్లో ఆర్డర్ చేయలేరు, ఎందుకంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.