Can Courts Attach EPF Money Against Debts ?: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అయిన డబ్బును కోర్టులు సదరు ఈపీఎఫ్ ఖాతాదారుడి అప్పు కింద అటాచ్ చేయడానికి ఆస్కారం ఉంటుందా ? ఈ విషయంలో ఈపీఎఫ్ చట్టం ఏం చెబుతోంది ? ఈపీఎఫ్ నిబంధనలు ఎలా ఉన్నాయి ?
Can Courts Recover PF Money Against Debts ?: ఈపీఎఫ్ మనీ విషయంలో చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులకు గురై అప్పుల ఊబీలో కూరుకుపోయిన ఈపీఎఫ్ ఖాతాదారులకు సహజంగానే కలిగే సందేహాలు అనేకం.
Interesting Facts About Your EPF Money: తమ అప్పులను రికవరీ చేసేందుకు బ్యాంకులు కానీ లేదా ఏవైనా క్రెడిట్ సొసైటీలు కోర్టులను ఆశ్రయిస్తే అప్పుడు తమ పరిస్థితి ఏంటనే అభద్రతా భావంలోంచి వచ్చేవే ఈ సందేహాలు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
Legal Protection Against Your EPF Money: ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈపీఎఫ్ చట్టం 1952 లోని సెక్షన్ 10 ప్రకారం ఈపీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తానికి చట్టబద్ధంగానే లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది.
EPF Money Vs Debts and Liabilities: ఇంకా చెప్పాలంటే.. ఒక వ్యక్తి చేసిన అప్పును తిరిగి రికవరీ చేసే ప్రయత్నంలో భాగంగా అతడు లేదా ఆమె ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్మును ముట్టుకోవడానికి ఏ కోర్టుకు కూడా ఎలాంటి అధికారం, హక్కులు లేవని ఈపీఎఫ్ చట్టంలోని సెక్షన్ 10 చెబుతోంది.
What Happens If a EPF Account Holder Dies in This case : అంతేకాకుండా.. ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారుడు చనిపోయినట్టయితే.. వారి అప్పులకు కానీ లేదా వారి నామిని చేసిన అప్పుల కింద కానీ ఈపీఎఫ్ మొత్తాన్ని అటాచ్ చేయడానికి వీల్లేదని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ స్పష్టంచేస్తోంది.
Employer Vs Employee in EPF Money: ఒకవేళ ఒక ఉద్యోగి లేదా ఉద్యోగిని నుంచి వారు ఉద్యోగం చేస్తోన్న కంపెనీ ఏదైనా డ్యూస్ రికవరీ చేసుకోవాల్సి వస్తే.. సదరు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈపీఎఫ్ మొత్తంలోంచి ఆ డ్యూస్ మొత్తాన్ని మినహాయించుకునేందుకు సైతం ఎంప్లాయర్‌కి అవకాశం లేదు.