Hybrid vs Plug in Hybrid Cars: ఆటోమొబైల్ రంగంలో హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు ఓ సంచలనం. రెండూ ఇంధనాన్ని ఆదాయ చేసేందుకు, ఎమిషన్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కానీ హైబ్రిడ్ వర్సెస్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్ల మధ్య అంతరముంది. అదేంటో సులభంగా అర్దమయ్యేలా పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైబ్రిడ్ కార్లు


హైబ్రిడ్ కార్లు రెండురకాల పవర్ ట్రేన్ వినియోగిస్తాయి. ఇందులో ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్‌కు బ్యాటరీ ప్యాక్ ద్వారా పవర్ సప్లై అవుతుంది. కారును నడిపేందుకు ఇంజన్ ప్రధాన భూమిక వహిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ సహాయం అందిస్తుంది. ఇందులో ఉండే బ్యాటరీ ఇంటర్నల్ వ్యవస్థ ద్వారానే ఛార్జ్ అవుతుంది. ఇంజన్ నడిపే సమయంలో ఉత్పత్తి అయ్యే పవర్ ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది. అంతేకాకుండా హైబ్రిడ్ కార్లలో రీజనరేట్ బ్రేకింగ్ ఉంటుంది. అంటే బ్రేకింగ్ సమయంలో ఉత్పత్తి అయ్యే పవర్ కూడా బ్యాటరీకు చేరుతుంది. 


ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు


ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు కూడా హైబ్రిడ్ కార్లలానే ఉంటాయి. కానీ ఇందులో బ్యాటరీ పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఈ బ్యాటరీని బయట్నించి ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో బ్యాటరీ ఛార్జ్ చేసేందుకు సాకెట్ విడిగా ఇస్తారు. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు సాధారణ హైబ్రిడ్ కార్లతో పోలిస్తే బ్యాటరీపైనే ఎక్కువ దూరం నడుస్తాయి. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లలో ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తుంటుంది. అయితే హైబ్రిడ్ కార్లతో పోలిస్తే ఇవి చాలా ఖరీదు. 


దేశంలో ప్రస్తుతం హైబ్రిడ్ కార్లే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎందుకంటే ప్లగ్ హైబ్రిడ్ లేదా పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కార్ల కంటే అనువుగా ఉంటున్నాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టొయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్, మారుతి ఇన్విక్టో, టొయోటా ఇన్నోవా హైక్రాస్ వంటి కార్లు హైబ్రిడ్ కార్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. అందుకే ఈ కార్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. 


Also read: Free Airport Lounge Access: క్రెడిట్ కార్డులు అందించే ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో కొత్త మార్పులు, చేర్పులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook