Hybrid Cars In India: ప్రస్తుతం కార్లు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరు మైలేజీతోపాటు ఇంజన్ కండీషన్ చెక్ చేసుకుంటున్నారు. అందుకే కార్ల తయారీ కంపెనీలు కూడా సరికొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంజిన్ పనితీరు, సామర్థ్యాన్ని పెంచేందుకు సరికొత్త టెక్నాలజీ కోసం వెతుకుతున్నాయి. అందులో ఈ హైబ్రిడ్ కూడా ఒకటి. హైబ్రిడ్ కార్ల (Hybrid Cars) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కార్లు ఎక్కువ మైలేజీ ఇస్తుండడంతో భారీ అమ్మకాలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంది..? ఈ కార్లు ఎలా పనిచేస్తాయి..? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు..? డీఏ పెంపు లెక్కలు ఇవే..!  


హైబ్రిడ్ కార్లు అంటే ఎలక్ట్రిక్ పవర్‌ను గ్యాసోలిన్‌తో అంటే పెట్రోల్ లేదా డీజిల్‌తో లింక్ చేస్తారు. హైబ్రిడ్ కార్లు గ్యాసోలిన్, ఎలక్ట్రిక్ పవర్‌ను సమానంగా మిళితం చేస్తాయి. మ్యానువల్‌గా ఆప్షన్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. కారు స్లోగా వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ పవర్ మోడ్‌లో.. కారు వేగం ఎక్కువగా ఉన్నప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ మోడ్‌లోకి ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ఈ కారులోని బ్యాటరీలకు ప్రత్యేకంగా ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కార్లలో చిన్న బ్యాటరీలు ఉంటాయి. కారు బ్రేకులు వేసినప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా ఛార్జ్ అవుతాయి. అంతేకాకుండా ఇంధనం కూడా ఎక్కవగా వృథా అవ్వదు. సాధారణంగా సిటీల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


హైబ్రిడ్ కార్ల ప్రయోజనాలు ఇవే..


==> ఎక్కువ మైలేజీ
==> తక్కువ కాలుష్యం
==> తక్కువ శబ్దం
==> ట్యాక్స్‌ బెనిఫిట్స్


మారుతి సుజుకి ఎర్టిగా హైబ్రిడ్ కార్లకు మన దేశంలో ఎక్కువగా డిమాండ్ ఉంది. ఎర్టిగా క్రూజ్ హైబ్రిడ్ ఈసారి K15B స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు 10ah బ్యాటరీతో వస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్‌లోకి వస్తోంది. ఈ కారు 104 PS, 138 Nm టార్క్ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ కారుతోపాటు ఇన్నోవా హైక్రాస్ కూడా హైబ్రిడ్ వేరియంట్‌లో మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో 2.0 లీటర్, 4-సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ బ్యాటరీతో పాటు 184.8 bhp అత్యధిక పవర్‌, 206 Nm టార్క్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అలాగే 21 kmpl మైలేజీతో ఇంధన సామర్థ్యంతో మార్కెట్‌లోకి వస్తుంది. పెట్రోల్, డీజిల్ కార్ల కంటే.. హైబ్రిడ్ హైబ్రిడ్ కార్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయి. మీరు తక్కువ ఇంధనం వాడకంతో కాలుష్యాన్ని తగ్గించాలని అనుకుంటే హైబ్రిడ్ కార్ల కొనుగోలు బెస్ట్ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ కార్ల కంటే హైబ్రిడ్ కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.


Also Read: ఐపీఎల్ కు ముందు కేకేఆర్ కు భారీ షాక్.. ఆ జట్టు నుంచి కీలక పేసర్ ఔట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter