7th Pay Commission DA Hike Latest Updates: మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike News) పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎంత పెరుగుతుందోనని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాదికి ముందు డీఏ 38 శాతం ఉండగా.. రెండుసార్లు 4 శాతం చొప్పున పెంచడంతో ప్రస్తుతం 46 శాతానికి చేరింది. మరోసారి 4 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం DA 50 శాతానికి చేరుకుంటుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డీఏ పెంపు (DA Hike) ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జనవరి 1వ తేదీ నుంచి వర్తించనుంది.
రీసెంట్‌గా రిలీజైన పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) 12 నెలల సగటు 392.83గా ఉండటంతో డీఏ పెంపుపై ఊహాగానాలు మొదలయ్యాయి. డీఏ పెంపు 50.26 శాతానికి చేరింది. CPW-IW డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం DA, DR నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తుండగా.. పదవీ విరమణ పొందిన పింఛనుదారులకు డీఆర్ ఇస్తారు. సాధారణంగా DA, DR ప్రతి సంవత్సరం రెండుసార్లు పెంచుతోంది. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో ప్రతి నెలా CPI-IW డేటాను విడుదల చేస్తుంది. డీఏ పెంపుతో 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.
డీఏ పెంపు లెక్కలు ఇలా..
కేంద్ర ప్రభుత్వం మరోసారి 4 శాతం DAను పెంచుతుందని అనుకుందాం.. నెలకు రూ.53,500 ప్రాథమిక వేతనం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుంటే.. ప్రస్తుతం 46 శాతం వద్ద డియర్‌నెస్ అలవెన్స్ రూ.24,610 అందుతోంది. 50 శాతానికి లెక్కిస్తే.. డీఏ రూ.26,750కి పెరుగుతుంది. అంటే జీతం రూ.26,750-రూ.24,610= రూ.2,140 పెరుగుతుంది. గతంలో మాదిరి కేంద్ర ప్రభుత్వం మార్చిలో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతేడాది డీఏ పెంపును మార్చి 24, 2023న ప్రకటించగా.. జనవరి నెల నుంచి వర్తింపజేసింది. హోలీ పండుగ గిఫ్ట్‌గా డీఏ ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter