Hyundai Alcazar 1.5 Turbo Petrol Car: హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ నుంచి మరో కొత్త కారు ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. హ్యూందాయ్ మోటార్స్ నుంచి 160 Hp పవర్, 253 Nm టార్క్ జనరేట్ చేసే శక్తిసామర్ధ్యాలతో వచ్చిన మొట్టమొదటి 1.5L టర్బో పవర్ పెట్రోల్ ఇంజన్ కారు ఇదే కావడం విశేషం. ఈ మోడల్లో బేసిక్ వేరియంట్ కారు ఎక్స్ షోరూం ధర రూ. 16.75 లక్షల నుంచి ప్రారంభం అవుతుండగా.. టాప్ ఎండ్ కారు ఎక్స్ షోరూం ధర 20.25 లక్షలుగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదివరకు ఉన్న 2.0L పెట్రోల్ ఇంజన్ కంటే ఈ కారు బేసిక్ వేరియంట్ ఖరీదు రూ. 65 వేలు ఎక్కువ. ఎందుకంటే ఈ కారులో కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా 6 ఎయిర్ బ్యాగ్స్ కలిగి ఉండటంతో పాటు మరెన్నో సరికొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని హ్యూందాయ్ మోటార్స్ స్పష్టంచేసింది. కొత్తగా లాంచ్ అయిన హ్యూందాయ్ అల్కాజార్ మోడల్లో ప్లాటినం 6MT 7 సీటర్ వేరియంట్ కారు ధర రూ. 18.65 లక్షలుగా ఉంది. ప్లాటినం (O) 7DCT ధర రూ. 19.96 లక్షలుగా, సిగ్నేచర్ (O) 7DCT ధర రూ. 20.25 లక్షలుగా ఖరారు చేసినట్టు హ్యూందాయ్ స్పష్టంచేసింది. అలాగే, 6 సీటర్. 7 సీటర్ వెర్షన్‌ కార్ల మధ్య రూ.10 వేల స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది.


అల్కాజార్ సిరీస్‌లో 159 హార్స్‌పవర్, 191 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ MPi పెట్రోల్ ఇంజన్‌ను హ్యుందాయ్ తొలగించింది. దీని స్థానంలో 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్ ఇన్‌స్టాల్ చేశారు. ఇది 5,500 ఆర్‌పిఎమ్‌తో 158 హార్స్‌పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 


అల్కాజర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కొత్తగా లాంచ్ అయినప్పటికీ.. ఇదే మోడల్లో డీజిల్ ఇంజన్‌ గతంలోనే లాంచ్ అయింది. డీజిల్ ఇంజన్ 116 హార్స్‌పవర్‌ 250 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్‌లో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా టార్క్ కన్వర్టర్‌ వేరియంట్‌తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సేఫ్టీ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా ఫ్రంట్, రియర్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లతో సహా ఆరు ఎయిర్‌ బ్యాగ్స్ కలిగి ఉండటం గమనార్హం.


ఇది కూడా చదవండి : Maruti to Mahindra: ఏ బ్రాండ్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయంటే..


ఇది కూడా చదవండి : Old Vehicles Seizing: ఆ నెంబర్ సిరీస్ వాహనం కనిపిస్తే చాలు సీజ్.. ఇప్పటికే 800 వాహనాలు సీజ్


ఇది కూడా చదవండి : Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo