Hyundai i20 Discount: ఐ20పై భారీ డిస్కౌంట్ ఆఫర్, త్వరపడండి మరో రెండ్రోజులే మిగిలింది
Hyundai i20 Discount: దేశంలో హ్యుండయ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. హ్యాచ్‌బ్యాక్ కార్లలో ప్రముఖంగా చెప్పుకోవల్సింది హ్యుండయ్ ఐ20. మంచి మైలేజ్ ఇచ్చే కారు కావడంతో చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడీ కారుపై హ్యుండయ్ కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం.
Hyundai i20 Discount: హ్యుండయ్ కంపెనీకు చెందిన బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఐ20. హ్యుండయ్ కంపెనీ ఈ కారుపై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా 45 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. ఐ20 కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Hyundai i20 కారుకు మార్కెట్‌లో చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇండియాలో చాలా క్రేజ్ సంపాదించిన కారు ఇది. బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు. మంచి మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడీ కారుపై కంపెనీ ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా 45 వేల వరకూ తగ్గింపు ఇస్తోంది. మీక్కూడా Hyundai i20 కొనే ఆలోచన ఉంటే వెంటనే త్వరపడటం మంచిది. ఎందుకంటే ఆగస్టు 31 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 45 వేలు తగ్గింపు అంటే సాధారణ విషయం కాదు.
పండుగ సీజన్ వచ్చిన ప్రతి సారీ హ్యుండయ్ కంపెనీ వివిధ కార్లపై ప్రత్యేక తగ్గింపు ప్రకటిస్తుంటుంది. ఈ డిస్కౌంట్ అనేది అన్ని మోడల్ కార్లపై ఒకేలా ఉండదు. కారు మోడల్‌ని బట్టి డిస్కౌంట్ మారుతుంటుంది. Hyundai i20 పై హ్యుండయ్ కంపెనీ క్యాష్ డిస్కౌంట్ 35 వేలు ఇస్తోంది. ఇది కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ 10 వేలు లభిస్తుంది. అంటే మొత్తం 45 వేల రూపాయలు తగ్గింపు ఉంటుంది.
Hyundai i20 ఫీచర్లు, ప్రత్యేకతలు
Hyundai i20లో 40కు పైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 26 సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉంటాయి. మిగిలినవి మోడల్‌ను బట్టి మారుతుంటాయి. స్టాండర్డ్ సేఫ్టీ ప్యాక్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
Hyundai i20లో మేన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఇంటెలిజెంట్ వేరియెబుల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాకుండా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఇప్పుడు కొత్తగా ఐడియల్ స్టాప్ అండ్ గో ఫీచర్ వచ్చి చేరింది. దాంతో మైలేజ్ మరింతగా పెరుగుతుంది. Hyundai i20 పోటీ మార్కెట్‌లో మారుతి బలేనో, టాటా ఆల్ట్రోజ్‌తో ఉంది.
Also read: JNV Admission 2025: జవహర్ నవోదయ విద్యాలయలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook