Hyundai Creta 2024 Facelift: దిమ్మతిరిగే ఫీచర్స్‌తో మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్..ధర, మైలేజ్ పూర్తి వివరాలు ఇవే..
Hyundai Creta 2024 Facelift Price: హ్యుందాయ్ కంపెనీ దిమ్మతిరిగే ఫీచర్స్ తో మార్కెట్లోకి తమ కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసింది. ఇది మొత్తం 7 వేరియంట్లలో లాంచ్ కాగా రెండు కలర్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కార్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Hyundai Creta 2024 Facelift Price: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్రెటా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌లోకి లాంచ్ అయింది. కస్టమర్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కంపెనీ ఈ SUVని రూ. 10.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. మార్కెట్లో ఎంతో డిమాండ్ కలిగిన ఈ కార్ 2024 సంవత్సరంలో అనేక రకాల కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కంపెనీ ఈ కారును మొత్తం 7 వేరియంట్లలో విడుదల చేసింది. త్వరలోనే మార్కెట్‌లోకి E, EX, S, S(O), SX, SX Tech, SX (O) వేరియంట్‌లలో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు ఈ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొత్తగా 6 మోనో-టోన్, 1 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ధర:
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ధర విషయానికొస్తే.. కంపెనీ బేస్ వేరియంట్ ను (1.5 లీటర్ MPi పెట్రోల్) ఎక్స్-షోరూమ్ ధర రూ. 10,99,900తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక టాప్ వేరియంట్ విషయానికొస్తే..1.5 లీటర్ U2 CRDi డీజిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.19,99,900తో రాబోతున్నట్లు సమాచారం. కంపెనీ మొత్తం 7 వేరియంట్లను డీజిల్, పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది.
క్రెటా ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ డిజైన్:
ఈ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సరికొత్త డిజైన్తో కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని డ్యాష్‌బోర్డ్ పూర్తిగా అప్‌డేట్ చేసి..10.25-అంగుళాల ఇంటిగ్రేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతోపాటు 360 విజిబిలిటీ సపోర్టుకి కంపెనీ కొత్త టెక్నాలజీని వినియోగించింది.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ఈ SUVలో ఇన్‌బిల్ట్ అలెక్సా సపోర్ట్ సిస్టమ్‌ను కూడా అందించింది. అలాగే 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, మూడు సి-టైప్ ఛార్జింగ్ పాయింట్స్ వంటి చాలా రకాల కనెక్టివిటీలను కలిగి ఉంటుంది. కార్ కి మంచి లుకింగ్ అందించే పనోరమిక్ సన్‌రూఫ్ ని కూడా అందిస్తోంది.
ఇంజన్ పవర్‌ట్రెయిన్ వివరాల్లోకి వెళితే, హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పటికే 1.5-లీటర్ MPi పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్ ఉండగా వీటికి అప్డేటెడ్‌గా..1.4-లీటర్ కప్పా టర్బో GDi పెట్రోల్ యూనిట్, 1.5-లీటర్ కప్పా టర్బో GDi పెట్రోల్ ఇంజన్ (160PS, 253Nm)లను తీసుకువచ్చింది. ట్రాన్స్‌మిషన్ వివరాల్లోకి వెళితే, 6-స్పీడ్ కలిగిన 1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్ AT ట్రాన్స్మిషన్ ను అందుబాటులోకి మార్కెట్‌లో విడుదల చేసింది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter