Hyundai Creta Price: కేవలం 7.5 లక్షలకే హ్యుందాయ్ క్రెటా .. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!
Buy Hyundai Creta Second Hand Cars Rs 8 Lakhs in Cars24. హ్యుందాయ్ క్రెటా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలనుకుంటే.. కేవలం 7.5 లక్షలు ఉంటే సరిపోతుంది.
Buy Hyundai Creta Second Hand Cars Rs 8 Lakhs in Cars24: ప్రస్తుతం భారత మార్కెట్‌లో 'హ్యుందాయ్ క్రెటా' హవా నడుస్తోంది. 2022లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో క్రెటా ఒకటి. కొత్త హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ. 10.44 (ఎక్స్ షోరూమ్) లక్షలుగా ఉంటుంది. టాప్ వేరియంట్ కోసం అయితే రూ. 18.24 లక్షల వరకు ఉంటుంది. ఈ కారును కొనుగోలు చేసినట్లయితే.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ మొదలైన అన్ని ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దాంతో కస్టమర్ ఆన్-రోడ్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సామాన్య ప్రజలకు కాస్త భారంగానే ఉంటుంది. అయితే క్రెటా పాత కారును కొనుగోలు చేయాలనుకుంటే.. కేవలం 7.5 లక్షలు ఉంటే సరిపోతుంది. కార్స్ 24 వెబ్‌సైట్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లను ఓసారి చూద్దాం.
2015 Hyundai Creta 1.6 SX (O) CRDI MANUAL:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో 2015 హ్యుందాయ్ క్రెటా 1.6 SX (O) CRDI మాన్యువల్ ధర రూ.7,72,000లుగా ఉంది. ఈ కారు రీడింగ్ 56,027 కిమీ. డీజిల్ ఇంజిన్ కారు అయిన ఈ కారు మొదటి యజమాని వద్ద ఉంది. నోయిడాలో ఈ కారు విక్రయానికి అందుబాటులో ఉంది.
2015 Hyundai Creta 1.6 S MANUAL:
2015 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ ధర రూ.7,81,000లుగా ఉంది. ఈ కారు 49,909 కిమీలు ప్రయాణించింది. ఈ పెట్రోల్ ఇంజన్ కారు మొదటి యజమాని వద్ద ఉంది. ఇది నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
2015 Hyundai Creta 1.6 S MANUAL:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో 2015 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ రీడింగ్ 27,923 కిమీలుగా ఉంది. ఈ పెట్రోల్ ఇంజన్ కారు మొదటి యజమాని వద్ద ఉండగా.. దీని ధర రూ. 8,47,000లుగా ఉంది. నోయిడాలో ఈ కారు విక్రయానికి అందుబాటులో ఉంది.
2018 Hyundai Creta 1.4 S CRDI MANUAL:
2018 హ్యుందాయ్ క్రెటా 1.4 S CRDI మాన్యువల్ ధర రూ.8,48,000లుగా ఉంది. నోయిడాలో ఈ కారు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ డీజిల్ ఇంజన్ కారు రీడింగ్ 84,661 కిమీలుగా ఉంది.
Also Read: Cheapest New Honda Activa 2023: ఖరీదైన కార్ల ఫీచర్లతో.. సరికొత్త చౌకైన హోండా యాక్టివా లాంచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.