Cheapest New Honda Activa 2023: ఖరీదైన కార్ల ఫీచర్లతో.. సరికొత్త చౌకైన హోండా యాక్టివా లాంచ్!

Budget Honda New Honda Activa 2023, Activa Launch with H Smart Key Feature. హెచ్-స్మార్ట్ టెక్నాలజీని హోండా యాక్టివా టాప్ వేరియంట్‌లో అందిస్తోంది. నాలుగు ఫీచర్లు కొత్త మోడల్‌లో అందుబాటులో ఉన్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 23, 2023, 06:38 PM IST
  • ఖరీదైన కార్ల ఫీచర్లతో
  • సరికొత్త చౌకైన హోండా యాక్టివా లాంచ్
  • హోండా యాక్టివా హెచ్-స్మార్ట్
Cheapest New Honda Activa 2023: ఖరీదైన కార్ల ఫీచర్లతో.. సరికొత్త చౌకైన హోండా యాక్టివా లాంచ్!

Honda Launch Budget Honda Activa with H Smart Key Feature: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. తన బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ యాక్టివాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. హెచ్-స్మార్ట్ టెక్నాలజీని టాప్ వేరియంట్‌లో అందిస్తోంది. ఈ స్కూటర్ అతిపెద్ద అప్‌డేట్ 'కీ ఫోబ్'. కొత్త హోండా యాక్టివా స్కూటర్ 'స్మార్ట్ కీ'తో వస్తుంది. స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ మరియు స్మార్ట్ ఫైండ్ అనే నాలుగు ఫీచర్లు కొత్త మోడల్‌లో అందుబాటులో ఉన్నాయి. హెచ్-స్మార్ట్ టెక్నాలజీ మినహా ఈ స్కూటర్‌లో పెద్దగా మార్పులు లేవు.

కొత్త యాక్టివా (Honda Activa H-Smart Key) మూడు వేరియంట్‌లలో విడుదల చేయబడింది. స్టాండర్డ్, డీలక్స్ మరియు స్మార్ట్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే 'స్మార్ట్ కీ' ఆప్షన్ స్టాండర్డ్ మరియు డీలక్స్‌ వేరియంట్‌లలో అందుబాటులో లేదు. ఈ ఫీచర్ యాక్టివా స్మార్ట్ వేరియంట్‌లో మాత్రమే ఉంది. ఈ వేరియంట్ అత్యంత ఖరీదైనది. యాక్టివా స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.74,536 కాగా.. డీలక్స్ వేరియంట్ ధర రూ.77,036లుగా ఉంది. ఇక స్మార్ట్ వేరియంట్ ధర రూ.80,537లుగా ఉంది. 7.73 bhp పవర్ మరియు 8.9 Nm టార్క్ ఉత్పత్తి చేసే కొత్త హోండా యాక్టివాలో 109.51cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్ అందించబడుతోంది. ఇంజన్ CVTతో వస్తుంది.

స్మార్ట్ కీలో రెండు బటన్లు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒక బటన్ స్మార్ట్ ఫైండ్ ఫీచర్ కోసం పనిచేస్తుంది. మీ స్కూటర్ రద్దీగా ఉండే ప్రదేశంలో లేదా పెద్ద పార్కింగ్ స్థలంలో పార్క్ చేయబడినపుడు ఈ కీ ఉపయోగకరంగా ఉంటుంది. పెద్ద పార్కింగ్ స్థలంలో మీ స్కూటర్‌ను కనుగొనడానికి ఉపయోగపడుతుంది. మీరు మీ స్కూటర్‌ను కనుగొనడానికి స్మార్ట్ ఫైండ్ బటన్‌ను ఉపయోగించవచ్చు. బటన్‌ను నొక్కిన వెంటనే... స్కూటర్ యొక్క బ్లింకర్లు బ్లింక్ అవుతాయి.

స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ ఫీచర్లు కూడా హెచ్-స్మార్ట్ టెక్నాలజీలో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్-కీ 2 మీటర్ల పరిధి దాటితే.. స్కూటర్ లాక్ చేయబడుతుంది. మీరు స్కూటర్ కీని 2 మీటర్ల పరిధిలోకి తీసుకురాగానే.. అన్‌లాక్ చేయబడుతుంది. కీలెస్ ఎంట్రీ ఉన్న కార్లలో ఉండే ఫీచర్ ఇదే.

Also Read: Saturn Moon Conjunction 2023: అరుదైన విష యోగం.. ఈ రాశుల వారి పని ఔట్! రాబోయే 3 రోజులు జాగ్రత్త  

Also Read: Motorola 5G Smartphone: కేవలం రూ. 699లకే మోటరోలా 5G స్మార్ట్‌ఫోన్.. బ్యాంక్ ఆఫర్‌ అనుకుంటే పొరబడినట్టే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News