Hyundai Santro Discontinued: హ్యుందాయ్ షాకింగ్ డెసిషన్. ఇక ఆ కారు ఉత్పత్తి బంద్..!
Hyundai Santro Discontinued: భారతీయ కార్లమార్కెట్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకుంది కొరియాకు చెందిన హ్యుందాయ్ సంస్థ. ఆ సంస్థకు చెందిన పలు మోడళ్లు భారత మార్కెట్‌లో మంచి సక్సెస్ సాధించాయి. అయితే సంస్థకు ఎంతో పేరుతెచ్చిన ఓ మోడల్ ఉత్పత్తిని నిలిపేయాలని నిర్ణయించింది హ్యుందాయ్.
Hyundai Santro Discontinued: హ్యుందాయ్ శాంత్రో. భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. 1998 లో శాంత్రో రిలీజ్ ఓ సంచలనం. భారతీయ మార్కెట్‌లో హ్యుందాయ్ కంపెనీకి గట్టి పునాది పడటానికి శాంత్రో ఎంతో సహకరించింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే లక్షలాదిగా కార్లు అమ్ముడుపోయాయి. భారతీయ అవసరాలకు తగ్గట్లు ఉన్న డిజైన్, తక్కువ ధర వినియోగదారులను బాగా ఆకర్షించింది. అప్పటి టాప్ సేలింగ్ కారు మారుతీ 800 కు ఒకానొక దశలో గట్టిపోటీ ఇచ్చింది హ్యుందాయ్ శాంత్రో. ఆ తర్వాత శాంత్రోను అప్‌గ్రేడ్ చేసి శాంత్రో Xing ను రిలీజ్ చేసింది. అది కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇలా దశాబ్దంన్నర పాటు సాగిన దాని సక్సెస్ జర్నీ 2015 లో ఆగిపోయింది. సంస్థ నుంచి కొత్త డిజైన్ కార్లు రావడం, ఇతర కారణాలతో 2015 లో శాంత్రో ఉత్పత్తిని హ్యుందాయ్ నిలిపివేసింది.
వినియోగదారుల నుంచి వచ్చిన డిమాండ్లు, ఎంట్రీ లెవల్లో హ్యుందాయ్‌కి చెప్పుకోదగ్గ కారు లేకపోవడంతో 2018 లో తిరిగి హ్యుందాయ్ సెకండ్ జనరేషన్ శాంత్రోను రిలీజ్‌చేసింది. పాత శాంత్రోకు కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేసి ఇంటీరియర్‌లో ఇప్పటి జనరేషన్ కు తగ్గ మార్పులు చేసింది. కొత్త శాంత్రో మార్కెట్‌లో తన వాటాను మరింత పెంచుతుందని హ్యుందాయ్ ఆశించింది. కానీ సెకండ్ జనరేషన్ శాంత్రో.. కంపెనీ అంచనాలను అందుకోలేకపోయింది. ఉత్పత్తి నిలిపివేసిన నాలుగేళ్ల కాలంతో పోటీ కంపెనీలనుంచి కొత్త కార్లు రావడం, వాటికి వినియోగదారులు ఆకర్షితులు కావడంతో... హ్యుందాయ్ ఆశించిన ఫలితాలు దక్కలేదు. వాటి సేల్స్ నాటినాటికీ తీసికట్టుగా తయారయ్యాయి. ఫలితంగా సెకండ్ జనరేషన్ శాంత్రో రిలీజైన నాలుగేళ్లకే కాలగర్భంలో కలిసిపోబోతోంది. ఇకనుంచి శాంత్రో కార్ల ఉత్పత్తిని బంద్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఉత్పత్తి అయిన కార్లు కొన్ని రోజులపాటు షోరూంలలో అందుబాటులో ఉండనున్నాయి.
సెకండ్ జనరేషన్ శాంత్రో మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు చెబుతున్నారు ఆటో ఎక్స్‌పర్ట్స్. అవేంటో ఇప్పుడు చూద్దాం...
డిజైన్ లోపాలు
శాంత్రో ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం దాని డిజైన్. పాత శాంత్రోతో పోల్చితే ఇంటీరియర్‌లో మార్పులు చేసినా.. ఎక్స్‌టీరియర్‌లో పెద్దగా మార్పులు చేయలేదు సంస్థ. పెద్దగా లుక్ మార్చకుండానే సెకండ్ జనరేషన్ కారును రిలీజ్ చేసింది. ఇది వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇతర సంస్థలతో పోటీ
1998 లో హ్యుందాయ్ భారత మార్కెట్‌లో అడుగుపెట్టినప్పుడు మారుతీ తప్ప ఇతర సంస్థల నుంచి పెద్దగా పోటీ ఎదురుకాలేదు. శాంత్రో లుక్స్ , పర్ఫార్మెన్స్ పరంగా బాగుండటంతో సక్సెస్ సాధించింది. కానీ 2018 వరకు పరిస్థితి మారింది. పలు ఇంటర్నేషనల్ కంపెనీలు భారత్ లో తమ కార్లను రిలీజ్‌చేశాయి. ముఖ్యంగా రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో, మారుతీ ఎస్ ప్రెస్సోతో పాటు ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీలనుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ పోటీని హ్యుండాయ్ శాంత్రో తట్టుకోలేకపోయింది.
ఇంజన్
హ్యుందాయ్ సంస్థ తక్కువ ధరకే కారు అందించాలనే ఉత్సాహంతో పాత శాంత్రో ఇంజన్‌లో పెద్దగా మార్పు చేయలేదు. 1.1 లీటర్ పెట్రోల్ ఇంజెన్ తో 67 హెచ్.పీ పవర్ తో కారు రిలీజ్ చేసింది. పోటీ సంస్థలు మంచి ఫర్మార్మెన్స్ ఇచ్చే కార్లు అందిస్తున్న తరుణంలో ఈ స్పెసిఫికేషన్స్ వినియోగదారులను ఆకట్టుకోలేదు.
మెయింటెనెన్స్ కాస్ట్
మారుతీతో పోల్చితే హ్యుందాయ్ కార్ల మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువే. దీంతో చాలామంది ఈ కార్లను కొనడానికి ఆసక్తి చూపించలేదు.
రీసేల్ వాల్యూ
పాత శాంత్రో కార్లకు ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కానీ సెకండ్ జనరేషన్ శాంత్రోను కొనడానికి సెకండ్ హ్యాండ్ బయర్స్ పెద్దగా ముందుకురాలేదు. ఫలితంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లోనూ శాంత్రో సక్సెస్ సాధించలేదు.
also read: I Kall Mobile Amazon: 249 రూపాయాలకే 4G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేయోచ్చు!
also read: SBI New Rules: ఎస్బీలో మారిన ఏటీఎం క్యాష్ విత్‌డ్రా నిబంధనలు, క్యాష్ ఎలా విత్‌డ్రా చేయాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.