Hyundai Exter Price: ప్రముఖ మోటర్స్‌ కంపెనీ హ్యుందాయ్ త్వరలోనే మార్కెట్‌లోకి మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయబోతోంది. ఎక్సెటర్ అనే పేరుతో హ్యుందాయ్ జూలై 10వ తేదిన భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేయనుంది. కంపెనీ ఇప్పటికే  ప్రి బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. హ్యుందాయ్ ఎక్సెటర్(Hyundai Exter) పోర్ట్‌ఫోలియో విషయానికొస్తే.. ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదల చేసిన వెన్యూను పోలి ఉంటుందని సమాచారం. ఈ మైక్రో SUV టాటా పంచ్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, సిట్రోయెన్ C3, మారుతి సుజుకి ఇగ్నిస్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్‌లకు పోటీగా నిల్వనుంది. అయితే ఈ కారుకు సంబంధించిన ధర ఇతర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొడవైన వీల్‌బేస్‌తో ఎక్సెటర్:
ఎక్సెటర్ వీల్‌బేస్‌ గ్రాండ్ i10 నియోస్‌ను పోలి ఉంటుంది. 1,631mm ఎత్తుతో పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్‌ సీట్‌లో సాఫిగా కూర్చిని ప్రయాణం చేసేందుకు విశాలమైన హెడ్‌రూమ్, లెగ్‌రూమ్‌ కూడా అందుబాటులో ఉంది. 


ఇంజిన్ పవర్ట్రైన్:
హ్యుందాయ్ ఎక్సెటర్ (Hyundai Exter) 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. ఇది నాలుగు సిలిండర్లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్, 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రాబోతోందని సమాచారం. 


Also Read: Find My Phone: మీ ఫోన్ చోరీకి గురైతే ముందు ఇలా చేయండి.. తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేయండి


ఎక్సెటర్ వేరియంట్స్‌, ధరలు:
ఎక్సెటర్‌(Hyundai Exter)ను కంపెనీ ఐదు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. తొలుత మార్కెట్‌లోకి EX, S, SX, SX (O), టాప్-స్పెక్ SX(O) కనెక్ట్ వేరియంట్లను విడుదల చేయబోతోంది. బేస్ EX ట్రిమ్ మినహా అన్ని వేరియంట్లు AMT గేర్‌బాక్స్‌తో రాబోతున్నాయి. ఇక ధర విషయానికొస్తే..6 లక్షల నుంచి ప్రారంభమై టాప్-స్పెక్ వేరియంట్ రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశాలున్నాయి. 


హ్యుందాయ్ ఎక్సెటర్ ఫీచర్లు:
✺ డాష్‌క్యామ్
✺ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ 
✺ LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్
✺ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
✺ LED టెయిల్ ల్యాంప్స్
✺ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్
✺ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
✺ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
✺ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే
✺ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
✺ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
✺ అలెక్సా కనెక్టివిటీ
✺ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
✺ మ్యాప్ అప్‌డేట్‌


Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook